వంగవీటి రాధాకు బంపర్ ఆఫర్..?

వంగవీటి రంగ తనయుడుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా ఎందుకనో అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధా..అదే చివరిసారి కావడం కూడా విశేషం.2009లో చిరంజీవి ప్రజారాజ్యం తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసినప్పటికి ఫలితం దక్కలేదు. ఇక 2019 ఎన్నికల ముందు జగన్‌తో విభేదించి టీడీపీ చేరారు.

2019 ఎన్నికల్లో టీడీపీ తరుఫున పోటీ చేయడానికి రాధాకు అవకాశం దక్కలేదు. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా రాధాకు మొండిచేయి ఎదురైంది. టీడీపీలో టికెట్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు నిరాశ ఎదురైంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గంలో రాధాకు టికెట్ కేటాయిస్తారని ఆయన అనుచరులు భావించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో రాధాను పక్కన పెట్టి వేరే అభ్యర్థులను చంద్రబాబు ప్రకంటించారు.

chances of Vangaveeti Radha becoming a minister

రాధాకు మరోసారి మొండిచేయి ఎదురైంది. దీంతో ఆయన టీడీపీని వీడుతున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన టీడీపీలోనే ఉంటూ కూటమి నేతల తరుఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యంగా వైసీపీ ఓటమే లక్ష్యంగా ఆయన పని చేశారు.కాపులు అధిక సంఖ్యలో ఉండే నియోజకవర్గాల్లో వంగవీటి రాధా ప్రభావం అధికంగా కనిపించింది. వంగవీటి రాధా తండ్రి వంగవీటి రంగను కాపులు తమ దైవంగా కొలుస్తారు. దీంతో కాపు ఓట్లను కూటమి వైపు మలచడంలో వంగవీటి రాధా ఎన్నికల ప్రచారం బాగా ఉపయోగపడింది.

అయితే కూటమి విజయం సాధించిన తర్వాత వంగవీటి రాధా ఊసే ఎత్తెడం లేదు. ఇటు రాధా కూడా బయటకు వచ్చి పెద్దగా హడావిడి చేసింది లేదు. అయితే వంగవీటి రాధాకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం శాసన మండలిలో నాలుగు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఒకటి రాధాకు కేటాయించి ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

అందుకే తొలుత 25 మందితో మంత్రివర్గాన్ని భర్తీ చేయాలని భావించినప్పటికి ..రాధా కోసం ఆ మంత్రి పదవిని భర్తీ చేయకుండా ఉంచారని సమాచారం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో బీసీలకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు. కాపుల కోటాలో ఇవ్వాలంటే కచ్చితంగా రాధాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+