మే 10న సింహాచలంలో చందోనత్సవం.. ఆ దర్శనాలు రద్దు..
ఏపీలోని ప్రసిద్దిచెందిన పుణ్యక్షేత్రాలలో సింహాచలం అప్పన్నస్వామి ఆలయం ఒకటి. ఇక్కడికి నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. సింహాచలంలో ఈ నెల 10వ తేదిన చందోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈసారి సామాన్య భక్తులందరికీ సులువుగా అప్పన్న నిజరూప దర్శనం కలిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గతంలో చందనోత్సవ సమయంలో జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. చందోనత్సవం రోజున తెల్లవారుజాము 3.30 గంటల నుంచి 4.30 గంటల మధ్య అంతరాలయ దర్శనం ఉంటుందని తెలిపారు. ఈ అంతరాలయ దర్శనం కూడా కేవలం ఆలయ అనువంశిక ధర్మకర్త, దాతలు, న్యాయమూర్తులకు మాత్రమే ఉంటుందని చెప్పారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రొటోకాల్ దర్శనాలకు అనుమతి లేదన్నారు.
ఇక మే 9వ తేదీ సాయంత్రం 6గంటల తర్వాత భక్తులకు అప్పన్న దర్శనాలు నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10న తిరిగి దర్శనాలు ప్రారంభమవుతాయన్నారు. ఆ రోజు వేకువజామున ఒంటి గంట తర్వాత దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే భక్తులను కొండపైకి అనుమతిస్తామని వివరించారు. అలాగే చందనోత్సవం రోజు 6.5 కిలోమీటర్ల మేర 29,500 మంది భక్తులు వేచి ఉండేలా క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు మే10వ తేదీ మధ్యాహ్నం 3గంటల నుంచి 4గంటల మధ్య దేవస్థానం ఉద్యోగులకు, సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు దివ్యాంగులకు స్వామివారి దర్శనాలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

భక్తుల రాకపోకలకు 40 బస్సులు..
చందనోత్సవానికి విచ్చేసే భక్తులకు సంస్థల సహకారంతో తాగునీరు, మజ్జిగ పంపిణీ చేస్తామన్నారు. సింహాచలం కొండపై, కిందికి భక్తుల రాకపోకలకు మొత్తం 40పెద్ద బస్సులు, 40 మినీ బస్సులు 15 కార్లు వంటి వాహనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండలు, వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే దర్శనానికి వచ్చే ప్రముఖులు, భక్తులు ఎవరైనా సరే దేవస్థానం బస్సుల ద్వారానే రావాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications