చంద్రబాబు మార్క్ రాజకీయం - లెక్క మార్చేనా..!!
ఏపీలో పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతుంది. సమయం సమీపిస్తున్న కొద్ది రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతుంది. వైసిపి, టిడిపి కూటమి గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చివరి రెండోల సమయం సద్వినియోగం చేసుకునేందుకు పోటీపడుతున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు తన మార్కు రాజకీయం అమలు చేస్తున్నారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మారుతున్న లెక్కలు
ఏపీలో ఎన్నికల రాజకీయం క్షణక్షణం మారుతుంది. గెలుపు పైన ప్రధాన పార్టీల అధినేతలు ధీమాగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు 5 ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. చివరి రోజు అయిన శనివారం చంద్రబాబు తన ప్రసంగాల్లో కీలక అంశాలను ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. అటు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచార నిర్వహిస్తున్నారు. ఈసారి గెలుపు కూటమినేతలకు ప్రతిష్టాత్మకంగా కావడంతో ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కౌంట్ డౌన్ మొదలు
చంద్రబాబు ప్రచారంతో పాటుగా పార్టీ అభ్యర్థుల నుంచి క్షేత్రస్థాయి సమాచారం ఎప్పటికప్పుడు సమీకరిస్తున్నారు. సర్వే నివేదికలు, రిపోర్టుల ఆధారంగా క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన చర్లపైన పార్టీ అభ్యర్థులను అలెర్ట్ చేస్తున్నారు. చివరి రోజు ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ పైన కీలక సూచనలు చేస్తున్నారు. చివరి రెండు రోజులు పోలింగ్ కు కీలకం కావడంతో జాగ్రత్తగా ఉండాలని అభ్యర్థులను కోరారు. ఎన్నికల పోలింగ్ సమయంలోనూ ప్రత్యర్థి పార్టీ వ్యవహరించే తీరుకు దీటుగా స్పందించాలని పార్టీ అధినాయకత్వం అభ్యర్థులకు స్పష్టం చేసింది. చివరి నిమిషంలో అనేక అంశాలు తెరమీదకు వస్తాయని సందర్భానుసారం స్పందించి పార్టీ కేడర్ అంతా కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు నిర్దేశించారు.

కొత్త వ్యూహాలతో ముందుకు
పార్టీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సీనియర్ నేతలు ఎన్నికల తీరును పర్యవేక్షిస్తున్నారు. వైసిపి ప్రచారాన్ని తిప్పికొడుతూనే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా అభ్యర్థులకు సూచనలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి మరింతగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సూపర్ సిక్స్ హామీలతో పాటుగా మేనిఫెస్టో అంశాలను విస్తృతంగా వివరించాలని నిర్దేశించారు. ఇక చివరి రోజున చంద్రబాబు పూర్తిగా ఎలక్షన్ మేనేజ్మెంట్ పైనే ఫోకస్ చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఆసక్తికరంగా మారుతుంది.












Click it and Unblock the Notifications