టీడీపీ కూటమి భవిష్యత్ ఆ ఇద్దరి మంత్రుల చేతుల్లోనే..!!
ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన మొదలైంది. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. మొత్తం 24 మంది మంత్రులకు సుదీర్ఘ కసరత్తు...భవిష్యత్ వ్యూహాలతో చంద్రబాబు శాఖలు ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. చంద్రబాబుతో సహా ఎన్డీఏ కూటమి ఈ సారి ఏపీలో రాజధాని , ఉపాధి, సంక్షేమం పైనే ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈ శాఖలు ఏరి కోరి ఇద్దరి మంత్రులకు అప్పించారు. ఆ ఇద్దరి పైన భారీ అంచనాలు ఉన్నాయి.
శాఖల కేటాయింపు
చంద్రబాబు ప్రభుత్వం సీనియర్లకు ప్రధాన శాఖలను కేటాయించారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు..పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఖరారు చేసారు. అదే విధంగా నారా లోకేష్ కు మానవ వనరులు అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖలు అప్పగించారు. మరో కీలక నేత అచ్చెన్నాయుడు కు వ్యవసాయశాఖను ఇచ్చారు. మహిళకు హోం శాఖ ఆనవాయితీని చంద్రబాబు కొనసాగించారు. వంగలపూడి అనితకు హోం శాఖ కేటాయించారు. బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా ఉన్న సత్యకుమార్ కు వైద్య - ఆరోగ్య శాఖకు అప్పగించారు.

కేశవ్ కు ఫైనాన్స్
రాష్ట్రంలో ఆర్దిక నిర్వహణ..రాజధాని అంశాలే కీలకంగా ప్రజలు మూడు పార్టీల కూటమికి పట్టం కట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా..ఆర్దిక, రాజధాని వ్యవహారాలను సీనియర్ మంత్రుల భుజస్కందాల పైన పెట్టారు. చంద్రబాబు పర్యవేక్షణ ఉన్నా..ఈ మంత్రుల పాత్రే కీలకంగా మారనుంది. ఇక విధంగా రానున్న రోజుల్లో కూటమి భవిష్యత్ ఈ ఇద్దరి చేతుల్లోనే ఎక్కువగా ఉంది. అప్పుల భారం పెంచకుండా.. ఇచ్చిన హామీల అమలు దిశగా ఆర్దిక నిర్వహణ ఎలా నిర్వహిస్తారనేది ఇప్పుడు కొత్త ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ సమర్దత పైన ఆధార పడి ఉంది.
అమరావతి బాధ్యతలు నారాయణకు
ఇక..2014లో రాజధానిగా అమరావతి ఖరారైన సమయం నుంచి మొత్తం బాధ్యతలను పురపాలకశాఖ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా నారాయణ పర్యవేక్షించారు. ఇప్పుడు తిరిగి నారాయణకు అవే శాఖలను కేటాయించారు. అమరావతి అంశంలో ఉన్న న్యాయ పరమైన వ్యవహారాలను పరిష్కరించుకుంటూ..రాజధాని నిర్మాణం పైన ముందుకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో..అమరావతి పైన నాడు చంద్రబాబుతో కలిసి ప్రతీ నిర్ణయంలో కీలకంగా వ్యవహరించిన నారాయణకు ఇప్పుడు రాజధాని అంశం ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. దీంతో..అటు కేశవ్ - ఇటు నారాయణ పని తీరు కీలకంగా మారనుంది.












Click it and Unblock the Notifications