బీజేపీ నుంచి బిగ్ అప్డేడ్ - చంద్రబాబు, పవన్ అలర్ట్..!!
ఏపీలో ఎన్నికల వేళ పొత్తుల లెక్కల పై క్లారిటీ వస్తోంది. మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్దమయ్యారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ కలిసి వస్తుందని వేచి చూస్తున్నారు. ఈ సమయంలోనే బీజేపీ నుంచి సంకేతాలు క్లియర్ గా ఉన్నట్లు ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఎన్నికల వేళ అలర్ట్ అయ్యారు. కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
పొత్తుల లెక్కలు
ఏపీలో వైసీపీ సింగిల్ గానే పోటీ చేస్తుంది. టీడీపీ, జనసేన 2014 తరహాలో బీజేపీతో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్నాయి. బీజేపీ తమతో కలిసి రావాలని పలు సందర్బాల్లో పవన్ కోరారు. ఢిల్లీ కేంద్రంగానూ మంత్రాంగం నడిపారు. ఏపీలో ఎన్నికల సమయంలో జగన్ ను ఎదుర్కోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు అవసరమని ఈ రెండు పార్టీల అధినేతలు భావిస్తున్నారు. కానీ, బీజేపీ నుంచి ఏ మాత్రం స్పష్టత రావటం లేదు. ఇదే సమయంలో ఏపీలో సొంతంగా పోటీకి అన్నట్లుగా బీజేపీ నేతలు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఎన్నికలకు సంసిద్దులను చేస్తోంది. ఇప్పటి వరకు వేచి చూసిన చంద్రబాబు, పవన్ పొత్తు పైన తేల్చటానికి బీజేపీకి డెడ్ లైన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.


బీజేపీ నిర్ణయం ఏంటి
పొత్తులో భాగంగా బీజేపీ, జనసేనకు 50 సీట్లు ఇస్తే తాము కలిసి వచ్చే అంశం ఆలోచన చేస్తామంటూ బీజేపీ నుంచి ప్రతిపాదన వచ్చినట్లుగా చెబుతున్నారు. అయితే, జనసేనకు 25 సీట్ల వరకు ఇచ్చేందుకు సిద్దమైన చంద్రబాబు బీజేపీకి 10 సీట్ల వరకు ఇస్తామని ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ విషయంలో బీజేపీ నుంచి అడుగు ముందుకు పడలేదని సమాచారం. పొత్తుకు ముందుకు వస్తే చర్చల్లో సీట్ల అంశం తేలుతుందని టీడీపీ, జనసేన నేతలు భావిస్తున్నారు. ఆ దిశగా బీజేపీ నుంచి మాత్రం సానుకూల స్పందన రావటం లేదు. దీంతో, మరో రెండు రోజులు మాత్రమే వేచి చూడాలని ఈ ఇద్దరు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో పవన్ ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అక్కడ బీజేపీ నేతలను కలిసి ఇక పొత్తుల పైన తేల్చాయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది.
వచ్చే వారం కీలకం
బీజేపీ మూడ్ అర్దం అయితే తమ రెండు పార్టీల అభ్యర్దులతో పాటుగా మేనిఫెస్టో ప్రకటన చేయాలనేది చంద్రబాబు, పవన్ అభిప్రాయంగా చెబుతున్నారు. బీజేపీ పొత్తుకు నో చెబితే సీపీఐతో కలిసి ముందుకు వెళ్లాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. బీజేపీ ఈ వారంలో పొత్తుల సంగతి తేల్చకుండా ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. జనసేన ముఖ్య నేతలు బీజేపీ కలిసి వస్తుందనే సమాచారం తమకు ఉందని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు పైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో, ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైన వేళ మరింత జాప్యం లేకుండా బీజేపీ నిర్ణయం ఏంటనేది స్పష్టత తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. బీజేపీ కూటమిలో చేరుతుందా లేదా అనేది మరో రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications