టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ల పై చంద్రబాబు సంచలన నిర్ణయం..!!

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు టిక్కెట్ల కేటాయింపు పై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఏపీలో ముందస్తుగానే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధికార - ప్రతిపక్ష పార్టీలు సీట్ల కేటాయింపు పైన ముందస్తు లీకులు - హెచ్చరికలు చేస్తున్నాయి. అందులో భాగంగా పార్టీ మహానాడు నంచి టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో 40 శాతం యువతకు సీట్లు ఇస్తామని.. సీనియర్లు సహకరించాలని చంద్రబాబు కోరారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సమయంలో మరో కీలక ప్రకటన చేసారు.

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

టీడీపీ శాసనసభాపక్ష సమావేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పని తీరు పైన స్పందించారు. తెలుగుదేశం పార్టీలో సిటింగ్‌ ఎమ్మెల్యేలు అందరికీ ఈసారి ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనున్నట్లు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికార పార్టీ పైన టీడీపీ ఎమ్మెల్యేలు వీరోచితంగా పోరాడుతున్నారంటూ ప్రశంసించారు. వీరికి తిరిగి టిక్కెట్లు ఇవ్వటంతో పాటుగా మరోసారి గెలిపించి తీసుకొస్తానని చంద్రబాబు వెల్లడించారు. తాను 1994లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలో ఉన్న 74 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లు కేటాయించిన అంశాన్ని గుర్తు చేసారు. వారిలో ఒకరు మాత్రమే ఓడిపోయారని..తిరిగి అందరూ గెలిచారని చెప్పుకొచ్చారు. కళా వెంకటరావు ఓడిపోగా.. తిరిగి ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయాన్ని టీడీఎల్పీ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

సిట్టింగ్ లు అందరికీ టికెట్లు

సిట్టింగ్ లు అందరికీ టికెట్లు

అదే సమయంలో వైసీపీలో సిట్టింగ్ లకు టిక్కెట్ల కేటాయింపు పైనా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వబోనని జగన్ బెదిరిస్తున్నారని, తమకు టికెట్ రానప్పుడు ఎందుకు పని చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఎమ్మెల్యేలు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ కోసం ప్రజల తరపున పోరాటం చేస్తున్నారని చెప్పారు. దీని కారణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిటి టిక్కెట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. క్షేత్రస్థాయిలో బలంగా పోరాడుతూ కేసుల్లో ఇరుక్కొంటున్న వారికి... కింది స్థాయిలో కార్యకర్తలకు అండగా నిలుస్తూ ప్రజల్లో పనిచేస్తున్న వారికి కూడా టికెట్లు ఖాయమని చంద్రబాబు ప్రకటించారు.

వైసీపీ పరిస్థితుల పైనా వ్యాఖ్యలు..

వైసీపీ పరిస్థితుల పైనా వ్యాఖ్యలు..

శాసనసభలో అమరావతి పైన జరిగిన చర్చలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు తప్పు బట్టారు. జగన్‌ కూడా అసెంబ్లీలో ఆమోదం తెలిపారని గుర్తు చేసారు. అమరావతి వలన తనకు మంచి పేరు వస్తుందనే కారణంగా ద్వేషం పెంచుకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. టీడీపీ హయాంలో విశాఖ, తిరుపతిల్లో అమరావతికి మించిన అభివృద్ధి జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు చంద్రబాబు చేసిన ప్రకటనతో 40 శాతం యువతకు..సిట్టింగ్ లకు సీట్లు తిరిగి ఇవ్వనున్నట్లు చంద్రబాబు చేసిన ప్రకటనతో ..టీడీపీలో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+