రఘురామకు సీటు అందుకే ఇచ్చాను - చంద్రబాబు..!!
ఏపీలో ఎన్నికలు కీలక దశకు చేరాయి. ప్రచారానికి ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. పోలింగ్ కు కౌంట్ డౌన్ కొనసాగుతోంది. సీఎం జగన్, చంద్రబాబు చివరి విడత ప్రచారంలో ప్రత్యర్దులను టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్రంలో జరగని కుంభకోణం అంటూ లేదని మండిపడ్డారు. మీ భూములు కొట్టేయడానికి ప్లాన్ వేశాడని, పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ధ్వజమెత్తారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందన్నారు.
ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని అన్నారు. ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించు కుంటుందో మీరు చూస్తారన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించేది అహంకారి, దోపిడీదారు అని తెలిపారు. ప్రశ్నించినందుకు ఎంపీ రఘురామ కృష్ణరాజును ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిందో మీకు తెలుసని పేర్కొన్నారు. రఘురామకు న్యాయం చేయడం కోసమే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుని కాదని, ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చామన్నారు. రఘురామను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

పట్టాదార్ పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం, సీపీయస్ రద్దు చేస్తానన్నాడని, కానీ చేయలేదంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. 30 లక్షల ఇళ్లు కడతానని చెప్పి ఆ ఇళ్లు కట్టించాడా? అని ప్రశ్నించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో ఇళ్లు ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. గంజాయిని వంద రోజుల్లోనే అణచివేస్తామన్నారు. అందరికీ మంచినీళ్లు ఇవ్వాలనే ఉద్దేశంతో జలజీవన్ స్రవంతిని తీసుకు వచ్చామన్నారు. కానీ, దానిలోనూ జగన్ అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్‌కు రూ. 1.50కే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications