అభ్యర్థులకు భద్రత కల్పించాలి - దాడి ఫొటోలతో సహా : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ..!!

కుప్పంలో జరుగుతన్న మున్సిపాల్టీ ఎన్నికల్లో అధికార వైసీపీ వర్సస్ టీడీపీ పోరు హోరా హోరీగా సాగుతోంది. ఎలాగైనా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో గెలవాలని వైసీపీ ప్రయత్నాలు చేస్తుంటే..తన నియోజకవర్గంలో పట్టు నిలబెట్టుకోవాలని చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందులో భాగంగా ఈ రోజున నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావటంతో చంద్రబాబు అక్కడి పరిస్థితులను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసారు. కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాల పైన ఫొటోలను సైతం జత చేసి ఫిర్యాదు చేసారు.

అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు

అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని లేఖలో ప్రస్తావించారు. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారని, నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం దగ్గరే దాడి జరిగిందని తెలిపారు. 30 మంది వైసీపీ గుండాల దాడిలో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడ్డారని, వెంకటేశ్‌ నామినేషన్‌ పత్రాలు చించివేసి.. ఫోన్‌ లాక్కొన్నారని లేఖలో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు అభ్యర్థులకు భద్రత కల్పించాలని కోరారు. దాడులు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు.

మా అభ్యర్ధిపైన దాడి చేసారు..ఇవీ ఆధారాలు

మా అభ్యర్ధిపైన దాడి చేసారు..ఇవీ ఆధారాలు

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయి. 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. నామినేషన్‌ దాఖలు చేసే కేంద్రం వద్దే టీడీపీ అభ్యర్థిపై దాడి జరిగింది. మధ్యాహ్నం జరిగిన దాడిలో వెంకటేశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 మంది వరకు దాడిలో పాల్గొని వెంకటేశ్‌ను కొట్టారు. వెంకటేశ్‌పై దాడిచేయడమే కాకుండా నామినేషన్ పత్రాలు చించేశారు. వెంకటేశ్‌ సెల్‌ఫోన్‌ లాక్కొని వెళ్లడంతో పాటు తీవ్రంగా కొట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకు ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలి.తక్షణమే కుప్పం ఉప ఎన్నికల్లో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

టీడీపీ అభ్యర్దులకు భద్రత కల్పించాలి

టీడీపీ అభ్యర్దులకు భద్రత కల్పించాలి

టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు చంద్రబాబు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పలు ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న ఘటనలపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అయితే, ఇప్పటికే ఎన్నికల సంఘం ఫిర్యాదులు ఉంటే వెంటనే ఎన్నికల సంఘానికి చెప్పేందుకు ప్రత్యేకంగా ఒక నెంబర్ ఏర్పాటు చేసింది. కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి నాయకత్వంలో ఈ రోజు బహిరంగ సభ నిర్వహించారు. ఈ రోజుతో నామినేషన్ల పర్వం ముగియటంతో ఇక్కడ రెండు పార్టీల నేతలు ఇప్పుడు ప్రచారం పైన ఫోకస్ చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+