వరద బాధితులకు పరిహారం పై చంద్రబాబు కీలక ప్రకటన..!!

వరదలతో నష్టపోయిన బాధితులకు ఏపీ ప్రభుత్వం బాసటగా నిలుస్తోంది. వారికి నష్టపరిహారం పైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేసారు. నష్టపోయిన ప్రతీ ఒక్కిరికీ అండగా నిలవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా ఇప్పటికే నియమించిన మంత్రుల కమిటీ నివేదిక ఆధారంగా పరిహారం ప్రకటించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి చంద్రబాబు తాజాగా బాధితులకు కీలక హామీ ఇచ్చారు.

బాధితులకు సాయం
వదర బాధితులకు నష్టపరిహారం పైన ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో భారీ వరదలతో అనేక మంది నష్టపోయారు. వరద నీట మునిగిన ఇళ్లతో పాటుగా పాక్షికంగా దెబ్బ తిన్న వాటికి పరిహారం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. అదే విధంగా వరదలో కోల్పోయిన వాహనాలు, వస్తువలకు కొంత మేర పరిహారం చెల్లించేలా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతీ ఇంటికి వెళ్లి నష్టం పైన ఆరా తీస్తున్నారు. ఈ లెక్కల ఆధారంగా పరిహారం పైన ఒక అంచనాకు రావాలని ప్రభుత్వం భావిస్తోంది.

Chandra Babu Assured special package will be announce for Flood areas in next week

చర్యలు ముమ్మరం
ఇటు విజయవాడలో పరిస్థితి క్రమేణా మెరుగు అవుతోంది. దీంతో...కొల్లేరు ముంపు ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే చేసారు. స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వరదల వలన దెబ్భతిన్న వరి పంటకు హెక్టారుకు రూ.25వేలు ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత అయిదేళ్ల పాలనలో ఏ ఒక్క నదిలోనూ గేట్లను రిపేర్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఎక్కడా కాలువలకు పూడిక తీయలేదని చంద్రబాబు వివరించారు. పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను రిజిస్ట్రేషన్లు చేసి అక్రమాలు చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.

అండగా నిలుస్తాం
ఏలూరులోనూ చంద్రబాబు పర్యటించారు. ప్రతీ ఏడాది వరదలు వస్తున్నాయి బాధితులు ముఖ్యమంత్రికి వివరించారు. ముంపు ముప్పు పైన పరిష్కారం చూడాలని కోరారు. ఒక నేరస్తుడితో రాజకీయం చేయక తప్పడం లేదన్నారు. ప్రజా హితం కోసం యుద్ధం తప్పడం లేదన్నారు. గత ప్రభుత్వంలో వరదలు వస్తే మిమ్మల్ని పరామర్శించారా? అని నిలదీశారు. చివరకు తన దెబ్బకు పరదాలు కట్టుకుని తిరిగే వ్యక్తి బురదలోకి దిగాడన్నారు. క్లౌడ్ బరస్ట్ వలనే ఊహించని విధంగా వరదలు వచ్చాయని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+