వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్ - నివేదికల ఆధారంగా టిక్కెట్లు..!!

|
Google Oneindia TeluguNews

రానున్న ఎన్నికలకు మహానాడు ద్వారా యుద్దం ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారటంతో..ఇప్పటికే వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీని పటిష్ఠపరిచే క్రమంలో పార్టీ నేతలకు హెచ్చిరకలు చేస్తున్నారు. పని చేయని నేతల విషయంలో నివేదికలు తెప్పించుకుంటున్నారు.

పార్టీ కోసం రెడ్డెక్కని..పని చేయని నిేతల విషయంలో కఠినంగా ఉండాలని నిర్ణయించారు. ఇటువంటి వారికి సంబందించి నివేదికలు ఇవ్వాలని పార్టీ నేతలకు సూచించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని పార్లమెంటరీ నియోజవకర్గాల వారీగా పార్టీ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రూపులు కనిపించకూడదని హెచ్చరించారు.

శ్రీకాకుళం-విజయనగరం, విశాఖ-అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్ల కోఆర్డినేటర్లతో సమీక్షలు నిర్వహించిన చంద్రబాబు.. నెల రోజుల్లో నేతల పని తీరులో సమూల మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు. పార్టీ పటిష్టత, ఇన్‌ఛార్జ్‌ల పనితీరుపై ఆయన వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. గ్రూపు రాజకీయాలతో పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించేది లేదని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు.

Chandra Babu clarified party Tickets will be issued only withground level reports

పార్టీ నేతల పని నేతల విషయంలో సమూల మార్పు అవసరమని..దానికి అనుగుణంగా నేతల్లో మార్పు రావాల్సిందేనని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎక్కడా గ్రూపులు కనిపించటానికి వీళ్లేదని స్పష్టం చేసారు. నిత్యం ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలని నిర్దేశించారు. పార్టీ నేతల పనితీరులో మార్పు కనిపించాలని తేల్చేసారు.

ప్రతీ నియోజకవర్గ స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పార్లమెంటు కోఆర్డినేటర్లు 15 రోజులు క్షేత్ర పర్యటన చేయాలని చంద్రబాబు సూచించారు. త్వరలోనే చంద్రబాబు సైతం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా పర్యటనలకు సిద్దం అవుతున్నారు. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు రోజుల పాటుగా..నెలకు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించాలని నిర్ణయించారు.

దీనికి ముందుగానే అక్కడి క్షేత్ర స్థాయిలో పరిస్థితుల పైన ఆరా తీస్తున్నారు. కీలక ఆదేశాలు ఇస్తున్నారు. మహానాడు నుంచి వచ్చే ఎన్నికలకు సిద్దం అవ్వటంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటుగా కఠినంగా వ్యవహరించాలని చంద్రబాబు నిర్ణయించారు.

English summary
TDP Chief Chandra Babu serious warning for party leaders, directed them to work for party with public issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X