అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సీఎం జగన్ టార్గెట్ మిస్ ఫైర్..!! చంద్రబాబు ధీమా అదే - ముఖ్యమంత్రి ఏం చేయబోతున్నారు..!!

|
Google Oneindia TeluguNews

ముఖ్యమంత్రి జగన్ 2024 ఎన్నికల లక్ష్యంగా వేగంగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు ఆ స్థాయిలో వేగం పెంయకపోయినా..పూర్తి క్లారిటీతో ఉన్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. సీఎం జగన్ తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనకు తిరిగి అధికారంలో కొనసాగేలా చేస్తాయనే నమ్మకంతో ఉన్నారు. అదే సమయంలో ఇంకా దాదాపు రెండేళ్ల పాటు ఈ పథకాలను అమలు చేయాల్సి ఉంది. ఆర్దికంగా కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో..తాను పేదల సంక్షేమం కోసం కరోనా కష్టాలు - ఆర్దిక సమస్యలు ఎదురైనా వెనకడుగు వేసేది లేదని.. ఇచ్చిన మాట ప్రకారం అన్ని అమలు చేస్తానని స్పష్టం చేసారు.

మూడు రాజధానులతో టీడీపీని టార్గెట్ చేసేలా

మూడు రాజధానులతో టీడీపీని టార్గెట్ చేసేలా


ఇదే సమయం లో ఏపీకి రుణాల రాకుండా ప్రతిపక్షం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఇక, ఈ సంక్షేమ పథకాలు చంద్రబాబు అధికారంలోకి వస్తే అమలు కావనే సంకేతాలు ఇస్తూ..తాను మాత్రమే వీటిని అమలు చేయగలననే విశ్వాసం కొనసాగేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో కొంత వరకు సక్సెస్ అయ్యారు. దీనిని ఎన్నికల వరకు నిలబెట్టుకోవాల్సి ఉంది. అయితే, ఈ సమయంలో మూడు రాజధానుల వ్యవహారం లోనూ సీఎం జగన్ కొత్త నినాదం తీసుకొచ్చారు. దీని ద్వారా టీడీపీని ఆత్మరక్షణలో పడేయాలని భావించారు.

చంద్రబాబు ధీమా వెనుక కారణం అదేనా

చంద్రబాబు ధీమా వెనుక కారణం అదేనా


అందులో భాగంగా... తాజాగా సీఎం జగన్ విశాఖ పర్యటనలో తాను ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం కోసం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలని నిర్ణయిస్తే..అడ్డుపడ్డారంటూ వ్యాఖ్యానించారు. అదే విధంగా రాయలసీమ ఆత్మగౌరవం కోసం కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు నిర్ణయిస్తే అడ్డుపడుతున్నారని సీఎం చెప్పుకొచ్చారు. దీని ద్వారా టీడీపీ ఈ ఆత్మగౌరవం నినాదంతో ఆ ప్రాంతాల్లో ఢిఫెన్స్ లో పడుతుందని.. తొలి నుంచి అమరావతికి మద్దతుగా ఉన్న చంద్రబాబు రాజకీయంగా ఆ ప్రాంతాల్లో దెబ్బ తింటారని వైసీపీ నేలు అంచనా వేసారు. కానీ, చంద్రబాబు ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో తన వైఖరి మరో సారి స్పష్టం చేసారు.

వైసీపీ అస్త్రం ఒకటి చేజారిందా

వైసీపీ అస్త్రం ఒకటి చేజారిందా


సీఎం జగన్ విశాఖ కేంద్రంగా రాజధానుల విషయం పైన టీడీపీని టార్గెట్ చేసినా..చంద్రబాబు తాము అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేస్తామని విశాఖ నడిబొడ్డున తేల్చి చెప్పారు. అదే సమయంలో విశాఖ రాజధానిగా కావాలా...విశాఖ అభివృద్ధి కావాలా అంటూ నినదించారదు. విశాఖలో జగన్ - సాయిరెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆరోపించారు. విశాఖ తో సహా ఉత్తరాంధ్ర వాసులు మూడు రాజధానులు కోరుకోవటం లేదనేది చంద్రబాబు నమ్మకం. అమరావతి పైనే చంద్రబాబుకు ప్రేమ ఉందని.. విశాఖ పైన లేదంటూ మంత్రులు ఇప్పుడు రియాక్ట్ అవుతున్నారు. కానీ, గతంలో ఏ నిర్ణయం అయినా ప్రకటించేందుకు..స్పష్టత ఇవ్వాలంటే త్వరగా తేల్చని వైఖరి నుంచి చంద్రబాబులో మార్పు కనిపిస్తోంది. అమరావతి విషయంలో మాత్రం ఒకటే విధానంతో కొనసాగుతున్నారు.

జగన్ తన వ్యూహం మారుస్తారా.. వాట్ నెక్స్ట్

జగన్ తన వ్యూహం మారుస్తారా.. వాట్ నెక్స్ట్


దీంతో.. ఇక విధంగా మూడు ప్రాంతాల్లో చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టాలనే వైసీపీ రాజకీయ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనేది ఇప్పుడు సందేహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఉత్తరాంధ్రలో రాజధాని సెంటిమెంట్ ఉంటే చంద్రబాబు అంత సులువుగా అక్కడే అమరావతి గురించి మరోసారి ఇంత క్లియర్ గా చెప్పే సాహసం చేయరనేది విశ్లేషకుల అంచనా. అదే విధంగా అమరావతి సెంటిమెంట్ సైతం పెద్దగా లేదనేది వైసీపీ ధీమా. దీంతో...ఎన్నికల సమయం నాటికి ఈ మూడు రాజధానుల వ్యవహారం లో రాజకీయంగా వైసీపీ మైలేజ్ సాధించేందుకు సీఎం జగన్ ఏం చేయబోతున్నారు... చంద్రబాబు కౌంటర్ గా ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Chandra Babu counter CM Jagan plan on Three Capitals, Babu stated they stick on Amaravati as AP Capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X