కీలక నియోజకవర్గంలో అభ్యర్దిని మార్చిన చంద్రబాబు..!!

ఏపీలో రేపటి నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. మూడు పార్టీల కూటమిలో కొన్ని సీట్ల మార్పు పైన కసరత్తు జరుగుతోంది. అనపర్తి, ఉండి తంబళ్లెపల్లె, జమ్మలమడుగు స్థానాల పైన టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. సర్వే నివేదిక ఆధారంగా అభ్యర్దుల మార్పు పైన చంద్రబాబు తుది కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా అనకపాల్లి పార్లమెంట్ పరిధిలోని మాడుగుల స్థానంలో ఇప్పటికే ప్రటించిన అభ్యర్దిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించారు.

మాడుగుల బరిలో బండారు
మాడుగుల నుంచి టీడీపీ అభ్యర్దిగా ఎన్నారై పైలా ప్రసాద్ ను చంద్రబాబు తొలుత ప్రకటించారు. ఇప్పటికే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, సీటు పైన ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే రామానాయుడు సీటు రాకపోవటం పైన కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ ప్రకటించిన ప్రసాద్ పైన సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో...అభ్యర్ది మార్పు పైన కొద్ది రోజులుగా చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్ది సీఎం రమేష్ సైతం మాడుగులలో అభ్యర్దిని మార్చాలని చంద్రబాబును కోరారు.

Chandra Babu decided to change Madugula Contesting Candidate to announce Bandaru name

సీఎం రమేష్ జోక్యంతో
తాజాతా చంద్రబాబు విశాఖ పర్యటనలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తో మాట్లాడారు. మాడుగుల నుంచి పోటీ చేయాలని సూచించారు. పెందుర్తి సీటు జనసేనకు వెళ్ళటంతో బండారు ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాను మాడుగుల నుంచి పోటీ చేయాలంటే తన కుమార్తెకు పెందుర్తి పార్టీ ఇంఛార్జ్ గా బాధ్యతలు కేటాయించాలని కోరారు. దీంతో..రంగంలోకి దిగిన సీఎం రమేష్ నేరుగా బండారు ఇంటికి వెళ్లి చర్చలు చేసారు. మాడుగుల నుంచి పోటీ చేయాలని కోరారు. చివరగా బండారు అంగీకరించారు. దీంతో..మాడుగుల సీటును బండారు కేయించిన చంద్రబాబు..పైలా ప్రసాద్ కు పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు.

Chandra Babu decided to change Madugula Contesting Candidate to announce Bandaru name

టీడీపీలో సీట్ల మార్పు
మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత బూడి ముత్యాల నాయుడు ఈ సారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కుమార్తె అనురాధా మాడుగుల నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. దీంతో, ఇప్పుడు బండారు సత్యానారాయణ అభ్యర్దిత్వం ఖరారు కావటంతో..ఆయన ప్రచారంలోకి దిగనున్నారు. టీడీపీ నుంచి అనపర్తి, ఉండి సీట్ల విషయంలోనూ ఈ రోజు పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అనపర్తి సీటు తిరిగి టీడీపీకి దక్కితే నల్లిమిల్లి పోటీలో కొనసాగనున్నారు. ఉండి సీటు రఘురామ రాజుకు దక్కటం ఖాయంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+