ఫలితాల వేళ చంద్రబాబు అనూహ్య నిర్ణయం - ఏం జరుగుతోంది..!!
ఏపీలో అధికారం దక్కేదెవరికి. ఎన్నికలు పూర్తయ్యాయి. గెలుపు పైన ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కూటమి వర్సస్ వైసీపీ అన్నట్లుగా మారిన ఎన్నికల యుద్దంలో ఓటర్లు తమ తీర్పు ఇచ్చారు. కానీ, రాజకీయంగా మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఇదే సమయంలో సీఎం జగన్ తాము 2019 కంటే మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తామని ధీమాగా చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఈ సారి అధికారం పైన టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. బీజేపీ, జనసేనతో జత కట్టి అధికారంలోకి రావటానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఓటింగ్ శాతం పెరగటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసి వస్తుందని ధీమాతో ఉంది. పోలింగ్ గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగింది. రికార్డు స్థాయిలో నమోదైంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసారు. దీంతో..వైసీపీలో విశ్వాసం పెరిగింది. తమ సంక్షేమ ఓట్ బ్యాంక్ తమకు మరోసారి అధికారం ఇస్తోందని నమ్ముతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ఫలితాల అంచనాల పైన తొలి సారి స్పందించారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని చెప్పారు.

2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని జగన్ దీమా వ్యక్తం చేసారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు ఈ సమయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదా.. వేస్తూ నిర్ణయించారు.జూన్ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వం ఏర్పాటు హడావుడి ఉండటంతో వాయిదా వేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్ కి నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు ఉంటాయని చంద్రబాబు వెల్లడించారు. ఎన్నికల ఫలితాల తరువాత మహానాడు నిర్వహణ పైన నిర్ణయం తీసుకోనున్నారు. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దీంతో..ఇప్పుడు ఫలితాల పైనే ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications