నేడు మ‌ళ్లీ ఢిల్లీ కి చంద్ర‌బాబు..! ఆ సీయం కు సంఘీభావం తెలిపేందుకు హ‌స్తిన ప్ర‌యాణం..!!

అమరావతి/ హైద‌రాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ దీక్షలో పాల్గొనేందుకు ఆదివారం రాత్రి అక్కడకు వెళ్లిన ఆయన, రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన అనంత‌రం మంగళవారం రాత్రే అమరావతి తిరిగివచ్చారు. అయితే రాష్ట్ర సమస్యలపై ఆ రాష్ట్ర సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం అక్కడ నిరసన దీక్ష చేపడుతున్నారు. ఆ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు ఈ రోజు బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు. దీనికోసం బుధవారం సాయంత్రం జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని చంద్రబాబు ఉదయానికి మార్చిన విష‌యం తెలిసిందే..!

Chandra Babu to Delhi again..! To say solidarity to that CM.. !

దీనితో పాటు విజయనగరం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన కూడా గురువారానికి వాయిదాపడింది. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం బుధవారం మధ్యాహ్నం భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే చంద్రబాబు ఢిల్లీ వెళ్లాల్సి రావడంతో ఈ కార్యక్రమాన్ని గురువారానికి వాయిదా వేశారు. ఇదిలా ఉండగా యూపీ సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ను అడ్డుకున్న వ్యవహారంపై చంద్రబాబు స్పందించారు. అఖిలేష్ పట్ల పోలీసు అధికారుల తీరును ఖండించారు. ఇక ఈ ఉద‌యం జ‌రిగిని మంత్రి వ‌ర్గ స‌మావేశంలో చంద్ర‌బాబు రాష్ట్ర స‌త్వ‌ర అభివ్రుద్ది కోసం కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+