రేవంత్ అంశంలో పార్టీకి చంద్రబాబు కీలక ఆదేశాలు..!?
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. రేవంత్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరు కాలేదు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. ఏపీలో టీడీపీ మిత్రపక్షం జనసేన తెలంగాణ లో బీజేపీతో కలిసి పోటీ చేసింది. కానీ, ఫలితాలు రివర్స్ అయ్యాయి. తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ శ్రేణులు అనుకూలంగా పని చేసాయి. గాంధీ భవన్ లోనూ టీడీపీ జండెలు ఎగిరాయి. ఈ సమయంలోనే పార్టీ నేతలకు రేవంత్ విషయంలో చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.
చంద్రబాబు నిర్ణయాలు : టీడీపీ అధినేత చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. తెలంగాణలో పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించటంతో..పార్టీ శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేసారు. ఖమ్మం జిల్లాలో ప్రియాంక గాంధీ ర్యాలీలో టీడీపీ జెండాలతో శ్రేణులు హజరయ్యారు. చంద్రబాబు సన్నిహిత సినీ ప్రముఖులు కాంగ్రెస్ కు అనుకూలంగా నగదు సమకూర్చారనే ప్రచారం జరిగింది. కాంగ్రెస్ గెలిచిన తరువాత గాంధీ భవన్ లో జరిగిన ఉత్సవాల్లో టీడీపీ జెండాలు కనిపించాయి. ఇక..బీజేపీతో జనసేన కలిసి పోటీ చేసినా..ఆ పార్టీ అభ్యర్దులకు డిపాజిట్లు దక్కలేదు. బీజేపీ నేతలు ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్దులు గెలుపొందారు.

రేవంత్ ప్రమాణ స్వీకారానికి దూరంగా : ఇక, తెలంగాణతో పాటుగా జరిగిన మరో నాలుగు రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. దీంతో..చంద్రబాబు పునారాలోచనలో పడ్డారు. ఏపీలో జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్నారు. పవన్ సైతం దీనికి అనుగుణంగా బీజేపీతో రాయబారం నడుపుతున్నారు. కానీ, ఇప్పటి వరకు బీజేపీ ఆలోచన ఏంటనేది స్పష్టత రాలేదు. ఇప్పటికే టీడీపీ తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. టీడీపీ మద్దతు దారులే సోషల్ మీడియాలో రేవంత్ - చంద్రబాబు అనుకూల ప్రచారం చేస్తున్నారు. దీంతో, చంద్రబాబు అలర్ట్ అయ్యారు. బీజేపీతో ఏపీలో పొత్తు కావాలంటే తాము రేవంత్ తో దూరంగా ఉండాలని నిర్ణయించారు. అందులో భాగంగానే రేవంత్ ను అభినందిస్తూ సందేశం కూడా ఇవ్వలేదు. ఇదే సమయంలో పార్టీ నేతలకు కీలక సూచనలు చేసారు.

బీజేపీకి దగ్గరయ్యేందుకేనా : రేవంత్ కు అనుకూలంగా..కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు పార్టీ నేతలు ఎవరూ స్పందించవద్దని సూచించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ కు టీడీపీ అనుకూలంగా వ్యవహరించిన కారణంగా భారీ నష్టం పొంచి ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ తో జరిగిన సమావేశంలోనూ ఇక తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు...కాంగ్రెస్ అంశాల పైన స్పందించకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినా చంద్రబాబు దూరంగానే ఉన్నారు. పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. దీంతో...ఇప్పటి వరకు రేవంత్ విజయం తమ గెలుపుగా భావించిన కొందరు టీడీపీ నేతలకు తాజా నిర్ణయాలు అంతు చిక్కటం లేదు. బీజేపీకి దూరం కాకూడదనే చంద్రబాబు ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.












Click it and Unblock the Notifications