వరద బాధితుల కోసం చంద్రబాబు తాజా ఆదేశాలు..!!

వదరతో భారీ నష్టం జరిగిన విజయవాడ నగరంలో క్రమేణా పరిస్థితులు మెరుగవుతున్నాయి. వరద తగ్గుముఖం పట్టింది. సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా ఉంది. ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తోంది. నగరంలో బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు ఇచ్చారు.

కీలక సూచనలు
ఆరో రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. డమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రెస్ ను తెలుసుకున్న ముఖ్యమంత్రి తాజా పరిస్థితిని ఆరా తీసారు. గండ్లుపూడ్చి వేత పనుల్లో భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం కీలకంగా మారింది.

Chandra Babu Directs offcials over relief operations in Vijayawada flood effected area

గండ్లు పూడ్చివేత
యుద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి....ఇప్పటికే రెండు గండ్లు పూడ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేస్తున్నట్లుగా వివరించారు. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తిచెయ్యాలని సీఎం సూచించారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు సీఎం తెలుసుకున్నారు.

ఏరియల్ సర్వే
నిత్యావసరాతో కూడిన 6 వస్తువుల పంపిణీపైనా సమీక్ష చేసిన సిఎం...ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి బాధితులకు అందిస్తున్నట్లు అధికారులు వివరించారు. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలని సీఎం నిర్దేశించారు. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్ లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాలనుంచి తీసుకురావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏరియల్ వ్యూ ద్వారా బుడమేరు ప్రవాహాలు, ముంపు, గండ్లు పడిన ప్రాంతం, బ్యారేజ్ దిగువన కృష్ణా నది ప్రవాహాలు, కొల్లేరు ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+