వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి రోజాపై టీడీపీ అభ్యర్ధి ఫిక్స్- అటు నుంచి హామీ: హోరా హోరీగా..!!

|
Google Oneindia TeluguNews

రానున్న ఎన్నికల్లో టీడీపీ హిట్ లిస్ట్ నియోజకవర్గాల్లో నగరి ఒకటి. మాజీ మంత్రి కొడాలి నాని.. తాజా మంత్రి రోజా తో పాటుగా రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి పైన టీడీపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. దీంతో.. అభ్యర్ధి ఎంపిక నుంచే జాగ్రత్తలు తీసుకుంటోంది. అందునా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా కావటంతో మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన తరువాత రోజా నగరి నుంచి 2014, 2019 లో వరుసగా గెలిచారు. సీఎం జగన్ మంత్రి వర్గ ప్రక్షాళనలో భాగంగా చివరి నిమిషంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. నగరిలో చంద్రబాబు కొత్త వ్యూహంతో ముందకు వెళ్తున్నారు.

చంద్రబాబు హిట్ లిస్టులో నగరి

చంద్రబాబు హిట్ లిస్టులో నగరి


అవకాశం వచ్చిన ప్రతీ సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు - లోకేష్ లక్ష్యంగా రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. క్రిష్ణా జిల్లాలో గుడివాడ - గన్నవరం తో పాటుగా చిత్తూరు జిల్లాలో రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి- మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరు పైన చంద్రబాబు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పుంగనూరు అభ్యర్ధిని చంద్రబాబు ప్రకటించారు. ఇక, ఇప్పుడు నగరికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2014 ఎన్నికల్లో రోజా నగరిలో టీడీపీ సీనియర్ నేత గాలి ముద్దు క్రిష్ణమ నాయుడు పైన 858 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచి తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో శాసనసభలో చోటు చేసుకున్న పరిణామాలతో రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసారు. ఆ తరువాత తిరిగి 2019 ఎన్నికల్లో గెలిచిన తరువాతనే రోజా మరోసారి అసెంబ్లీకి వెళ్లారు. ఇక, వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవుతున్న సమయంలో నగరి నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే నుంచి రోజా అసమ్మతి ఎదుర్కొంటున్నారు.

సొంత పార్టీలోనే రోజాకు సమస్యలు

సొంత పార్టీలోనే రోజాకు సమస్యలు


ఇదే విషయం పైన పలుమార్లు రోజా ఆవేదన వ్యక్తం చేసారు. తాజాగా, గడపగడపకు ప్రభుత్వం నిర్వహణలోనూ రోజా వెనుకబడినట్లు సీఎం జగన్ వద్దకు వచ్చిన సర్వే నివేదికల్లో స్పష్టం అయింది. మెరుగుపరచుకోవటానికి మంత్రి రోజాతో సహా పలువురి నేతలకు సీఎం జగన్ టైం నిర్దేశించారు. ఇప్పుడు వరుసగా నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నగరి ఇంఛార్జ్ గా ఉన్న గాలి భాను ప్రకాశ్ ను తిరిగి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న గాలి కుటుంబానికి కాదని, మరొకరి ఇవ్వటం సరి కాదనే అభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి భాను ప్రకాశ్ 77,625 ఓట్లు సాధించారు. కాగా, రోజాకు 2019 ఎన్నికల్లో 80,333 ఓట్లు దక్కాయి. ఈ సారి నియోజకవర్గంలో వైసీపీలో నెలకొన్న విభేదాలు.. ప్రభుత్వ వ్యతిరేకత పార్టీకి కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ టార్గెట్

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ టార్గెట్

రోజా మీద పోటీ కోసం పలువురు సినీ హీరోయిన్ల పేరు టీడీపీలో ప్రచారంలోకి వచ్చాయి. వాణీ విశ్వనాధ పేరు అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో నియోజకవర్గంలో గాలి కుటుంబానికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇదే సమయంలో టీడీపీ - జనసేన మధ్య పొత్తుల పైన చర్చ జరగుతున్న వేళ.. పొత్తు ఖరారైతే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసుకొనే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తరచూ రోజా విమర్శలు కొనసాగిస్తున్నారు. జనసైనికులు నగరిలో రోజా ను ఓడిస్తామంటూ సవాళ్లు చేస్తున్నారు. దీంతో..టీడీపీ - జనసేన ఉమ్మడి టార్గెట్ రోజా అయ్యారు. దీంతో..రోజాను ఎలాగైనా ఈ సారి గెలవకుండా చూడాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ - జనసేన ఎన్నికల నాటికి ఏ రకంగా తమ వ్యూహాలు అమలు చేస్తారు.. మంత్రి రోజా ఏ రకంగా ఈ రెండు పార్టీలను ఎదుర్కొంటారనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.

English summary
TDP Chief Chandra Babu decided Gali Bhanu Prakash as party candidate in Nagari constiteuncy against Minster Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X