జగన్ కు ఉచ్చు, చంద్రబాబు కొత్త స్కెచ్ - ఢిల్లీలో సీన్ ఛేంజ్..!!

ఆదానీ కేసులో జగన్ ను ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అమెరికా కోర్టులో ఆదానీ ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం లంచాలు ఇచ్చారని అభియోగాలు నమోదయ్యాయి. జగన్ పేరు ప్రస్తావన పైన కూటమి ఆచి తూచి స్పందిస్తోంది. కేంద్రంతో ఉన్న సత్సంబంధాల కారణంగా ఆదానీ వివాదం పైన స్పందించటం లేదు. కానీ, ఈ కేసులో జగన్ ను మాత్రం ఫిక్స్ చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం న్యాయ పరంగా..అదే విధంగా రాజకీయంగానూ మంతనాలు చేస్తున్నారు. కానీ, ఢిల్లీ నేతల అభిప్రాయమే ఇక్కడ కీలకంగా మారుతోంది.

కూటమి ప్రభుత్వం కసరత్తు
విద్యుత్ ప్రాజెక్టు ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్ ను వదల కూడదని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఈ కేసు పైన కూటమిలోని ముఖ్య నేతలు మాత్రం ఇప్పటి వరకు అధికారి కంగా స్పందించ లేదు. కేంద్ర ప్రాజెక్టు సెకీతో నాడు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఆదానీ కేసులో ఇదే సాంకేతికంగా కీలకం కాబోతోంది. అటు ఆదానీ అంశం కావటంతో కూటమి నేతలు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో బీజేపీ నాయకత్వం ఆలోచన ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆదానీ గురించి ప్రస్తావన లేకుండా జగన్ పైన ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉందనేది పరిశీలిస్తున్నారు.

Chandra Babu Government seek legal opinion to fix Jagan in Adani bribe case decision soon

న్యాయ సలహా కోసం
సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం చేసుకోవడానికి రూ.1750 కోట్ల లంచం ఇచ్చారని చార్జిషీటులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఉన్నారని చార్జిషీటులో నిర్దిష్టంగా ప్రస్తావించారు. దీని ఆధారంగా జగన్‌పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయవచ్చా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహా ఇందుకు సానుకూలంగా వస్తే జగన్‌ను ప్రాసిక్యూట్‌ చేయడానికి గవర్నర్‌ అనుమతిని ప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది. అవినీతి నిరోధక చట్టంలోని 17 ఏ అధికరణం ప్రకారం మాజీ సీఎంను అరెస్టు చేసి విచారణ జరపడానికి గవర్నర్‌ అనుమతి అవసరమని ప్రభుత్వంలోని ముఖ్యులు గుర్తు చేస్తున్నారు.

Chandra Babu Government seek legal opinion to fix Jagan in Adani bribe case decision soon

ఢిల్లీ అభిప్రాయం మేరకు
తాజాగా అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ఇదే అంశం పైన పలువురు సభ్యులు సభలో ప్రస్తావన చేసారు. జగన్ పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేసారు. కానీ, ముఖ్యమంత్రి స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతి సహించబోమని ..అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసులో ప్రధానంగా ఆదానీ పైన ఆరోపణలు రావటంతో కేంద్రంతో చర్చలు చేయాలని భావిస్తోంది. ఆదానీ పాత్ర పైన బీజేపీ ఏ రకంగా స్పందిస్తుంది..జగన్ పైన చర్యలకు దిగితే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయనే అంశం పైన అభిప్రాయాలు తీసుకుంటున్నారు. దీని పైన ఢిల్లీ నేతలతో చర్చించిన తరువాతనే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. దీంతో, ఇప్పుడు ఢిల్లీ అభిప్రాయం కీలకంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+