నలుగురూ నాలుగు వైపులా - సీఎం జగన్ చుట్టూ "చంద్ర"వ్యూహం, చేధిస్తారా...!!

ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం నేతలు ప్రజల మధ్యకు వస్తున్నారు. సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చంద్రబాబు..పవన్ కల్యాణ్..లోకేశ్ తో పాటుగా బీజేపీ కేంద్ర నేతలు ఇక్కడే మోహరిస్తున్నారు. అందరి లక్ష్యం ఒక్కరే. ఈ రోజు నుంచి ఏపీలో కొత్త రాజకీయం మొదలవుతోంది. సీఎం జగన్ ఈ వ్యూహాన్ని చేధిస్తారా..ఏం జరుగుతోంది.

సీఎం జగన్ లక్ష్యంగా:ఇప్పటికే ఏపీలో నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ తన యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ రోజు నుంచి జనసేనాని పవన్ తన వారాహి యాత్ర ప్రారంభిస్తున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన నేడు ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పర్యటన చేస్తున్న అమిత్ షా ఏపీలో వైసీపీ ప్రభుత్వం పైన చేసిన ఆరోపణలు కలకలంగా మారాయి. వైసీపీ వీటిని తిప్పి కొట్టింది.

Chandra Babu implementing new political sketch to target CM Jagan, Four sides Attack on YCP Govt

బీజేపీ మద్దతు తనకు ఉండకపోవచ్చని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. టీడీపీ, బీజేపీ పొత్తు పైన అధికారికంగా ప్రకటన రాకపోయినా..ఆ దిశగానే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం పర్యటనకు వస్తున్న అమిత్ షా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించటం ద్వారా తన ఉద్దేశం స్పష్టం చేస్తున్నారు. .ఖమ్మం బహిరంగ సభలో పొత్తుల వ్యవహారం పైన క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

నలుగురు నాలుగు వైపులా:వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి..ముఖ్యమంత్రిగా మాత్రమే సభలోకి అడుగు పెడతానని చంద్రబాబు ప్రకటించారు. వచ్చే ఎన్నికలు టీడీపీకి నవ్ ఆర్ నెవర్ అని తేల్చి చెప్పారు. ఇందుకోసం బీజేపీతో మరోసారి చేతులు కలపటానికి సిద్దమయ్యారు. పవన్‌తోనూ పొత్తుకు సిద్దమయ్యారు. ఇప్పుడు చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటన ప్రారంభిస్తున్నారు. సీమ నుంచి కోస్తా జిల్లాల్లోకి లోకేష్ యాత్ర ప్రవేశించింది.

గోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర ప్రారంభం అవుతోంది. ఉత్తరాంధ్రలో విశాఖలో అమిత్ షా వైసీపీ ప్రభుత్వంపైన ఆరోపణలు ఎక్కుపెట్టారు. వీరందరూ తమ యాత్రలు..ప్రసంగాల్లో ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. తమ పైన చేసే ఆరోపణలు తిప్పి కొట్టేందుకు వైసీపీ నేతలు సిద్దమయ్యారు. తొమ్మది నెలల ముందే ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలవుతోంది.

సీఎం జగన్ ఒక్కరే...చేధిస్తారా:ఈ నలుగురు ఒక వైపు..జగన్ ఒక్కరూ ఒక వైపు అన్నట్లుగా ఏపీ రాజకీయం మారుతోంది. ఎంత మంది కలిసినా..తాను సింగిల్ గానే ఫైట్ చేస్తానని జగన్ పదే పదే చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు గురించి వైసీపీ ముందుగానే అంచనాకు వచ్చింది. బీజేపీ తో కలిసే అవకాశం లేదని ముందు నుంచి చెబుతోంది. బీజేపీ, టీడీపీ ఇప్పుడు తిరిగి కలిసినా..ఓట్ల విషయంలో ప్రభావం ఉండదని అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలతో చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజల్లో చర్చ..ఆదరణ లేదనేది వైసీపీ వాదన.

జగన్ ను ఎదుర్కోలేకనే వీరందరూ కలసి కట్టుగా వస్తున్నారని ప్రచారం ప్రారంభించారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు తాము కలుస్తున్నామని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఇక ఈ రోజు నుంచి జగన్ టార్గెట్ రాజకీయాలు తీవ్రం కానున్నాయి. దీనికి సీఎం జగన్ కౌంటర్ స్ట్రాటజీ ఎలా ఉంటుందీ.. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+