సీఎంగా చంద్రబాబు తొలి సంతకాలు - కీలక మార్పు..!!

ఏపీలో ఎన్డీఏ కూటమి కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రి గా చంద్రబాబు..డిప్యూటీ సీఎంగా పవన్ ప్రమాణ స్వీకారానికి సిద్దమయ్యారు. చంద్రబాబు తన మంత్రివర్గాన్ని ప్రకటించారు. మహిళలు - యువతకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సమీకరణాల ఆధారంగా మంత్రివర్గాన్ని ఖరారు చేసారు. ఇక..ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు ప్రధాన హామీల పైన సంతకాలు చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు ఈ సంతకాల విషయంలో మార్పు చోటు చేసుకుంది.

ప్రమాణ స్వీకారం
చంద్రబాబు నాలుగో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. 25 మంది ఏపీ మంత్రివర్గం కొలువు తీరుతోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ విజయవాడ రానున్నారు. ప్రమాణ స్వీకార ముహూర్తానికి కొంత ముందు ఆయన రానున్నారు. ఇక్కడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన భువనేశ్వర్‌ వెళ్లి ఒడిసా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని సమాచారం. కాగా... చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రసంగాలు ఏవీ ఉండవని నిర్వాహకులు పేర్కొన్నారు.

Chandra Babu Key decision over first three signatures as Asusred in Election campaign

సంతకాలు వాయిదా
ప్రధాని ప్రసంగం కూడా ఉండబోదని అంటున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత అదే ప్రాంగణంలో కొత్త మంత్రులతో అల్పాహార విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రధానిని కూడా ఆహ్వానించారు. ప్రధానికి చంద్రబాబు స్వాగతం పలకనున్నారు. కార్యక్రమం పూర్తయిన తరువాత ప్రధానికి వీడ్కోలు పలికేందుకు చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం వెళ్లనున్నారు. ఇక, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మూడు ప్రధాన హామీలకు సంబంధించి ప్రమాణ స్వీకారం వెంటనే సంతకాలు చేయాలని చంద్రబాబు గతంలో నిర్ణయించారు. కానీ, ఇప్పుడు స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు గురువారం తొలి సంతకాలు చేయనున్నారు.

Chandra Babu Key decision over first three signatures as Asusred in Election campaign

రేపు మూడు సంతకాలు
కొన్ని కారణాల వల్ల ఈ రోజు జరిగే కార్యక్రమాన్ని కేవలం ప్రమాణ స్వీకారానికి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం సీఎంగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన తిరుమల వెళతారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుని, అక్కడి నుంచి బయల్దేరి 10.45 గంటలకు అమరావతి సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయ ఉద్యోగుల స్వాగత కార్యక్రమం పూర్తి కాగానే ఒకటో బ్లాకులోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ... 'ఎస్సీ నోటిఫికేషన్‌ పైనే తొలి సంతకం పెడతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు... సంబంధిత ఫైలుపై సంతకం చేస్తారు. ఆ తర్వాత... సామాజిక పింఛను రూ.4వేలకు పెంపు, నైపుణ్యాభివృద్ధి, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దుతోపాటు మరో ఫైలుపై ఆయన సంతకం చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+