కొడాలి నాని పై చంద్రబాబు బ్రహ్మాస్త్రం - టీడీపీ అభ్యర్ధి ఖరారు, అనూహ్యంగా..!?
వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా చంద్రబాబు కీలక అడుగులు వేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలోనూ అభ్యర్దుల విషయంలో ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ సారి ఎన్నికల్లో గుడివాడ, గన్నవరం చంద్రబాబుకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అక్కడ బలమైన అభ్యర్ధలను బరిలోకి దింపాలని డిసైడ్ అయ్యారు. తాజాగా గుడివాడలో పర్యటించిన సమయంలో చంద్రబాబు అభ్యర్ధి ఎవరనేది స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు టీడీపీ నుంచి అనూహ్యంగా నందమూరి తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డిని బరిలోకి దింపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గుడివాడలో టీడీపీ అభ్యర్దిగా : గుడివాడలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు చాలా రోజులగా అక్కడ ఫోకస్ చేసారు. ప్రస్తుతం రావి, రాము ఇద్దరూ సీటు కోసం పోటీ పడుతున్నారు. చంద్రబాబు వరుసగా నియోజకవర్గాల్లో పర్యటన సమయంలో వివాదం, పోటీ ఉంటే మినహా అభ్యర్ధుల ప్రకటన చేస్తూ వస్తున్నారు. కానీ, గుడివాడలో అభ్యర్ధిని ఖరారు చేయలేదు. ఇప్పుడు తాజాగా అక్కడ సర్వేలు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో నందమూరి బాలయ్య గుడివాడ సీటు గురించి చంద్రబాబుకు కీలక సూచన చేసినట్లు తెలుస్తోంది. గుడివాడలో నందమూరి కుటుంబం నుంచి బరిలో ఉంటే గెలుపు ఖాయమనే లెక్కలు వేస్తున్నారు. ఆకస్మికంగా అందరికీ దూరమైన తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డిని పోటీకి దింపే అంశం పైన సీరియస్ గా చర్చలు నడుస్తున్నాయి.

బాలయ్య సూచించారంటూ: తారకరత్న కూడా తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. తారకరత్న మరణం సమయంలో నందమూరి బాలయ్య అన్నీ తానై వ్యవహరించారు. కుప్పంలో తారకరత్న కుప్ప కూలిన సమయం నుంచి చికిత్స..ఆ తరువాత తారకరత్న మరణించిన సమయంలో అంతిమ సంస్కారాల వరకు అండగా నిలిచారు. వైసీపీ నేత విజయసాయిరెడ్డి సైతం బాలయ్య వ్యవహరించిన తీరును అభినందించారు. ఆ విపత్కర సమయంలోనే తారకరత్న సతీమణి, పిల్లలకు అండగా నిలుస్తామని బాలయ్య..చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు అలేఖ్య రెడ్డిని గుడివాడ లో ఎన్నికల బరిలోకి దింపటం ద్వారా వారికి న్యాయం చేసినట్టుగా ఉండటంతో పాటుగా సానుభూతి కూడా కలిసి వస్తుందని అంచనా.

అలేఖ్య అంగీకరిస్తారా: గుడివాడలో సీటు కోసీ పోటీ ఉన్నా..నందమూరి కుటుంబం నుంచి బరిలోకి దిగితే అందరూ సహకరించటం ఖాయంగా కనిపిస్తోంది. నందమూరి బాలయ్య, పవన్ కల్యాణ్ సైతం తారకరత్న సతీమణి పోటీలో ఉంటే ప్రచారం చేసి..మరింతగా మద్దతు కూడగట్టే ఛాన్స్ ఉందనే లెక్కలు వినిపిస్తున్నాయి. తారకరత్న మరణించిన సమయంలో కొడాలి నాని సైతం హైదరాబాద్ వెళ్లి నివాళి అర్పించారు. అయితే, టీడీపీ ముఖ్య నేతల ప్రతిపాదనకు తారకరత్న సతీమణి అలేఖ్య రెడ్డి అంగీకారం చెబితే, గుడివాడ టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉండటం ఖాయమని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం మొత్తం మరో వారం రోజుల్లో పూర్తి స్పష్టత వస్తుందని టీడీపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.

-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..!












Click it and Unblock the Notifications