టీడీపీ కీలక పదవుల్లో మార్పులు - ఎవరికి ఏ హోదా..!!
తెలుగుదేశం లో ప్రక్షాళనకు రంగం సిద్దమైంది. కీలక పదవుల్లో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలోనే సుదీర్ఘ కాలం పదవుల్లో కొనసాగుతున్న వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. ఇందులో ఏ ఒక్కరు మినహాయింపు లేకుండా కసరత్తు కొనసాగుతోంది. మే లో పార్టీ మహానాడు జరగనుంది. ఈ లోగానే పార్టీ కొత్త పాలిట్ బ్యూరోతో పాటుగా జాతీయ, రెండు రాష్ట్రాల కమిటీల్లోనూ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఇప్పటికే పార్టీలో చర్చ మొదలైంది.
పార్టీలో పదవుల ప్రక్షాళన
టీడీపీ తాజాగా కోటి మంది సభ్యత్వం కలిగిన పార్టీగా రికార్డు సాధించింది. ఈ సమయంలోనే పార్టీ లో పదవుల విషయంలో చంద్రబాబు కీలక నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సీనియర్లకు పదే పదే అవకాశం వస్తుండటంతో.. ఈ విధానంలో మార్పులు తెచ్చి పార్టీ కోసం పని చేసిన సామాన్యులకు గుర్తింపు ఇచ్చేలా పదవులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. ఇందు కోసం పాలిట్ బ్యూరో తో పాటుగా జాతీయ కమిటీలోనూ సీనియర్లు - యువత కాంబినేషన్ లో కొత్త నియామకాల పైన కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. మూడు సార్లు వరుసగా పదవుల్లో ఉన్న నేతలను తప్పించటం ఖాయంగా కనిపిస్తోంది.

సీనియార్టీ - యువత
పార్టీ పాలిట్ బ్యూరోలో ప్రస్తుతం చంద్రబాబు, యనమల రామకృష్ణుడు, పూసపాటి అశోక్ గజపతి రాజు, చింతకాయల అయ్యన్న పాత్రుడు,కేఈ, చినరాజప్ప, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నంద మూరి బాలకృష్ణ, వర్ల రామయ్య, కిమిడి కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, గోరంట్ల, ఎండీ షరీ ఫ్, బోండా, ఎన్‌ఎండీ ఫరూక్, గల్లా జయదేవ్, రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి, పితాని, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత,గుమ్మడి సంధ్యా రాణి, అరవింద్ కుమార్ గౌడ్ తో పాటుగా ఎక్స్ - అఫీషియో సభ్యలుగా నారా లోకేష్, కింజరాపు అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్ ఉన్నారు. అదే విధంగా జాతీయ కమిటీలోనూ పలువురు సీనియర్లు కొనసాగుతున్నారు.
మార్పులు - చేర్పులు
జాతీయ కార్యవర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శులుగా ఉన్న లోకేశ్, రామ్మోహన్ నాయుడు తమ పదవులు వదులుకోవటానికి సిద్దమయ్యారు. వీరి స్థానంలో కమిటీలో కొత్త వారికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కాగా, లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. బాలకృష్ణ కు ప్రధాన కార్యదర్శిగా నియమించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం జాతీయ కమిటీలో ముగ్గురు మహిళలు ప్రధాన కార్యదర్శు లుకా ఉన్నారు. ఇక, కొత్త కమిటీలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ.. ప్రాంతీయ - సామాజిక సమీకర ణాలను బ్యాలెన్స్ చేస్తూ ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు ముందే పార్టీ పొలిట్ బ్యూరో సమావేశమై మార్పులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీంతో, పార్టీలో ఇప్పుడు పదవుల వ్యవహారం ఉత్కంఠ పెంచుతోంది.
-
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications