టీడీపీ, జనసేన లిస్టు సిద్దం, ఉత్కంఠ - జాబితాలో ఉన్నదెవరు..!!

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. టీడీపీ, జనసేన అభ్యర్దుల జాబితా పైన ఉత్కంఠ కొనసాగుతోంది. తొలి జాబితాను చంద్రబాబు - పవన్ విడుదల చేయనున్నారు. రెండు పార్టీల జాబితా వెల్లడి కానుండటంతో ఎవరికి సీట్లు దక్కుతాయి..ఎవరు త్యాగరాజులుగా మిగులుతారనేది తేలి పోనుంది. ఈ జాబితా ప్రకటన తరువాత అసలు యుద్దం మొదలు కానుంది. ఇప్పటికే టీడీపీ నుంచి ఖాయమైన అభ్యర్దుల జాబితాలో ముఖ్య నేతలు ఉన్నారు.

పొత్తులో ఎవరెక్కడ: టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా తమ అభ్యర్దుల తొలి జాబితా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఇరు పార్టీల అధినేతలు ఈ జాబితాను ప్రకటించనున్నారు. రెండు పార్టీల పొత్తులో భాగంగా కొందరు సీనియర్ల కు సీట్లు దక్కవని తెలుస్తోంది. కొందరిని సమీప నియోజకవర్గాలకు సర్దుబాటు చేస్తున్నారు.

Chandra Babu - Pawan Kalyan to announce contesting Candidates list from both parties today

బీజేపీ కూటమిలో చేరటం ఖాయం కావటంతో ఆ పార్టీకి కేటాయించే సీట్ల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తొలి జాబితాలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో నలుగురు మినహా మిగిలిన వారికి సీట్లు కేటాయిస్తారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీకి దిగనున్నారు. అదే విధంగా రాజోలు, రామచంద్రాపురం, తెనాలి, నర్సాపురం, రాజానగరం, తాడేపల్లిగూడెం, తణుకు, భీమిలి, గాజువాక, తిరుపతి, యలమంచిలి సీట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

అభ్యర్దులు ఖరారు
టీడీపీ నుంచి ఆముదావలస - కూన రవికుమార్, ఇచ్ఛాపురం - బెందాలం అశోక్, టెక్కలి - అచ్చెన్నాయుడు, రాజాం - కొండ్రు మురళీమోహన్, అరకు - దొన్ను దొర, సాలూరు - గుమ్మడి సంధ్యా రాణి, అనకాపల్లి - పీలా గోవింద్, నర్సీపట్నం - అయ్యన్నపాత్రుడు, విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ వెస్ట్ - గణ బాబు, కొత్తపేట - బండారు సత్యానందరావు, మండపేట - జోగేశ్వర రావు, జగ్గంపేట - జ్యోతుల నెహ్రూ, .

పెద్దాపురం - చిన రాజప్ప, తుని - యనమల దివ్య, అనపర్తి - నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి శ్రీనివాస్, పాలకొల్లు - నిమ్మల రామానాయుడు, ఆచంట - పితాని సత్యనారాయణ, తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ, ఉండి - మంతెన రామరాజు, చింతలపూడి - సొంగా రోషన్, దెందులూరు - చింతమనేని ప్రభాకర్, ఏలూరు - బడేటి రాధాకృష్ణ పేర్లు దాదాపు ఖరారయ్యాయి.

జాబితాలో ఉన్నదెవరు
అదే విధంగా.. గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ - వెనిగండ్ల రాము. , మచిలీపట్నం - కొల్లు రవీంద్ర, జగ్గయ్యపేట - శ్రీరామ్ తాతయ్య, తిరువూరు - కోలికపూడి శ్రీనివాస్, నందిగామ - తంగిరాల సౌమ్య, విజయవాడ సెంట్రల్ - బోండా ఉమామహేశ్వర రావు, విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన్, మంగళగిరి - నారా లోకేష్, పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాడు - బి.రామాంజనేయులు, తాడికొండ - తెనాలి శ్రావణ్ కుమార్, చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్ల - జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, సత్తెనపల్లి - కన్నా లక్ష్మీనారాయణ.

అద్దంకి - గొట్టిపాటి రవికుమార్, పర్చూరు - ఏలూరి సాంబశివ రావు, రేపల్లె - అనగాని సత్యప్రసాద్, వేమూరు - నక్కా ఆనంద్ బాబు, కనిగిరి - ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి, కొండెపి - డోలా బాల వీరాంజనేయులు, ఒంగోలు - దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం - ఎరిక్సన్ బాబు,మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి, నెల్లూరు సిటీ - పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్లు ఖాయమైనట్లు తెలుస్తోంది.

కొనసాగుతున్న ఉత్కంఠ
ఇక, సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గూడూరు - పాశం సునీల్, కుప్పం - చంద్రబాబు నాయుడు, నగరి - గాలి భాను ప్రకాష్, పలమనేరు - అమర్నాథ రెడ్డి,హిందూపురం - బాలకృష్ణ,తాడిపత్రి - జేసీ అస్మిత్, రాప్తాడు - పరిటాల సునీత, ఉరవకొండ - పయ్యావుల కేశవ్, కడప - రెడ్డప్పగారి మాధవి, పులివెందుల - బీటెక్ రవి, మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్, కర్నూలు - టీజీ భరత్, నంద్యాల - ఫరూక్, పత్తికొండ - కేఈ శ్యాం, ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ పేర్లు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాల సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+