చంద్రబాబు 13 గంటల ప్రయాణం - షరతులు ఉల్లంఘించారా..!?
టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం సాయంత్రం 4.40 గంటలకు రాజమహేంద్రవరంలో బయలుదేరిన చంద్రబాబు బుధవారం ఉదయం 5 గంటలు దాటాక ఉండవల్లి చేరుకున్నారు. పార్టీ కేడర్ చంద్రబాబుకు ప్రతీ చోటా ఘన స్వాగతం పలికారు. అయితే, చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కోర్టు విధించిన షరతులు ఉల్లంఘించారని..దీని పైన ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఉండవల్లికి చంద్రబాబు: హైకోర్టు మధ్యంతర బెయిల్ పైన విడుదల అయిన చంద్రబాబు కుటుంబసభ్యులతో రోడ్డు మార్గంలో బయలుదేరి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకున్నారు. అర్థరాత్రి వేళ, తెల్లవారు జామున సైతం వేల సంఖ్యలో జనం రోడ్ల వెంట పోటెత్తారు. ఆయన నివాసం వద్ద పెద్ద ఎత్తున నాయకులు, మహిళలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

మహిళలు పెద్దఎత్తున ఇంటివద్దకు చేరుకుని గుమ్మడికాయలతో దిష్టితీస్తూ అధినేతకు నీరాజనాలు పలికారు. కాగా రాజమండ్రి జైలు వద్ద నుంచి చంద్రబాబు మంగళవారం సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరారు. నివాసానికి చేరుకోగానే చంద్రబాబుకు సతీమణి నారా భువనేశ్వరి హారతిచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఆమె దిష్టి తీశారు. మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకుని గుమ్మడికాయలు కొట్టారు.
పార్టీ నేతల స్వాగతం: ఈ ఉదయం 4 గంటల ప్రాంతంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్ రామవరప్పాడు మీదుగా విజయవాడ నగరంలోకి ప్రవేశించింది. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఆయనను చూడగానే ఒక్కసారిగా కేరింతలు కొడుతూ రోడ్లపైకి వచ్చారు. బాబు చూసేందుకు రోడ్ల మీద పడుకుని మరి పడిగాపులుకాసారు.
వందలాది వాహనాలు చంద్రబాబుని అనుసరిస్తూ వచ్చాయి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం అంటూ నినాదాలతో విజయవాడ నిర్మలా కాన్వెంట్, బెంజి సర్కిల్ పరిసరాలు మారుమోగాయి. జనసేన కార్యకర్తలు చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురేగి స్వాగతం పలికారు. చంద్రబాబు కాన్వాయ్‌కు ఎదురేగి స్వాగతించారు. సంఘీభావంగా జనసేన కార్యకర్తలు నినాదాలు చేశారు.

హైదరాబాద్ లో చికిత్స: అయితే, చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు సమయంలో కోర్టు షరతులు విధించింది. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత చంద్రబాబు వాటిని ఉల్లంఘించారనే చర్చ మొదలైంది. సీైడీ అనుబంధం పిటీషన్ పై తీర్పు వెలువడేంత వరకు మీడియాతో మాట్లాడకూదని ఆదేశించింది. ర్యాలీల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది.
ఇక, చంద్రబాబు ఈ మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్లనున్నారు. ఉండవల్లి నివాసంలోనే వ్యక్తిగత వైద్యులు ప్రాధమిక పరీక్షలు చేయనున్నట్లు సమాచారం. ఈ సాయంత్రం హైదరాబాద్ కు పయనం కానున్న చంద్రబాబు.. గతంలో చికిత్స తీసుకున్న ఏఐజీ ఆస్పత్రిలోనే తిరిగి పరీక్షలు చేయించుకొని..వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications