AP Inter Supplementary Results 2026: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల..!
ఏపీలో ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు (AP Inter Supplementary Results 2026 ) ఇవాళ విడుదలయ్యాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షల్లో తప్పిన వారు, అలాగే బెటర్ మెంట్ కోసం పరీక్ష రాసిన వారికి ఈ ఫలితాలు వర్తిస్తాయి. వీటిని ఎలా చెక్ చేసుకోవాలన్న దానిపైనా లోకేష్ వివరాలు వెల్లడించారు.
ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల (#IPASE2026) ఫలితాలు ఈరోజు వెలువడ్డాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నామని లోకేష్ ట్వీట్ చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను http://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో లేదా మనమిత్ర వాట్సాప్ నెం. 9552300009 ద్వారా చూసుకోవచ్చన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణులైన, అనుత్తీర్ణులైన విద్యార్థులిద్దరికీ మెరుగుపరుచుకునే అవకాశాలను కల్పించడం ద్వారా, 1.83 లక్షలకు పైగా విద్యార్థులు తమ పనితీరును మెరుగుపరుచుకున్నారన్నారు. అదే సమయంలో, ఇంటర్మీడియట్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని దాదాపు 1 లక్ష మంది విద్యార్థులు తమ విద్యా ప్రయాణాన్ని కొనసాగించడానికి మరో అవకాశాన్ని పొందారని తెలిపారు.

AP EAPCET Result 2026: ఎంసెట్ ఫలితాల ముహుర్తం ఫిక్స్-ఇలా చెక్ చేసుకోండి..!
విజయవంతంగా ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ, పట్టుదల, కృషి ద్వారా తమ పనితీరును మెరుగుపరుచుకున్న వారికి అభినందనలు తెలిపారు. మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం, మీ విద్యా ప్రయాణంలో మీరు నిరంతర విజయం సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నానని లోకేష్ తెలిపారు. మొదటి సంవత్సరం 2,29,034 మంది అభ్యర్థులలో 1,35,435 మంది విద్యార్థులు (59%) మార్కుల్ని మెరుగుపరుచుకున్నారు. 1,09,003 మంది అభ్యర్థులలో 42,379 మంది విద్యార్థులు (39%) ఉత్తీర్ణులై తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు. రెండవ సంవత్సరంలో 91,303 మంది అభ్యర్థులలో 48,149 మంది విద్యార్థులు (53%) తమ ఫలితాల్ని మెరుగుపరుచుకున్నారు.1,02,018 మంది అభ్యర్థులలో 57,327 మంది విద్యార్థులు (56%) ఉత్తీర్ణులై తమ ఫలితాలను మెరుగుపరుచుకున్నారు.













Click it and Unblock the Notifications