మధిర కేంద్రంగా రైతులకు పండుగ.. మీ ఖాతాల్లో నగదు జమకు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ రైతులకు మరో తీపికబురు. వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న మధిరలో విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసి, రైతులను సంతోషపెట్టనున్నారు. సీఎం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు.

రైతుభరోసా నిధులకు సంబంధించి ఏర్పాట్లు

రైతుభరోసా నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సభ నిర్వహణ, నిధుల విడుదల కార్యక్రమం సున్నితంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ కార్యక్రమం రైతుల మధ్య భారీ స్థాయిలో ఉత్సాహం నింపుతుందని అంచనా వేస్తున్నారు. మధిరలో రేవంత్‌రెడ్డి పాల్గొనడం ద్వారా స్థానిక రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంకా ఉత్సాహంగా ఉంటారు.

cm revanth reddy will give rythu bharosa funds on june 26th in madhira constituency in joint khammam district

ప్రతి ఏటా రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం

ఇది కేవలం నిధుల విడుదల కార్యక్రమం మాత్రమే కాదు. రైతుల సమస్యలు, వ్యవసాయ రంగం అభివృద్ధి, సీజన్ సన్నద్ధతపై సీఎం సమీక్షించే అవకాశం కూడా ఉంది. రైతుభరోసా పథకం ద్వారా ప్రతి ఏటా రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం తన మద్దతును చాటుతోంది. ఈ సారి వానాకాలం పంటల సాగుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం

మరోవైపు, రాష్ట్రంలో నాణ్యమైన వరి విత్తనాల సరఫరా, పంటల పరిస్థితుల పర్యవేక్షణ, పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోళ్లు సజావుగా జరిగేలా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం వ్యవసాయ కార్యదర్శి సురేంద్రమోహన్ ఛైర్మన్‌గా, పౌరసరఫరాల కమిషనర్ స్టీపెన్ రవీంద్ర, వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దాస్ జానయ్య, ఇతర అధికారులతో ఈ కమిటీ పని చేస్తుంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఆ 75 వేలమందికి శుభవార్త.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ళలో వారికే తొలి ప్రాధాన్యత!
ఆ 75 వేలమందికి శుభవార్త.. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ళలో వారికే తొలి ప్రాధాన్యత!

రైతులకు ఇది శుభవార్త

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులు సమయానికి అందడం ద్వారా వ్యవసాయం మరింత వెన్నుదన్నుగా నిలుస్తుంది. రైతు భరోసా కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రైతులకు ఇది నిజంగా శుభవార్తనే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+