షర్మిల, సునీతకు చంద్రబాబు మార్క్ షాక్ - మిస్ ఫైర్..!!

ఏపీ ఎన్నికల రాజకీయం లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. అధికారంలోకి రావటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పటి వరకు వైఎస్ కుటుంబంలో పరిణమాలను చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. ఇప్పుడు సడన్ గా షర్మిల, సునీతను ఫిక్స్ చేసారు. సునీత ప్రచారం రాష్ట్రానికి చేటు తెస్తుందన్నారు. చంద్రబాబు ఎందుకు తన వైఖరి మార్చుకున్నారు.

చంద్రబాబు వ్యాఖ్యలతో
వివేకా హత్య కేసులో సునీతకు మద్దతుగా నిలవాలని గతంలో చంద్రబాబు పిలుపునిచ్చారు. సునీత కుటుంబం నుంచి ఒకరిని కడప ఎన్నికల్లో బరిలో నిలిపే అంశం పైనా చర్చ సాగింది. గత అయిదేళ్ల కాలంగా వివేకా హత్య కేసులో జగన్, అవినాశ్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన నేతలు ప్రచారం చేస్తున్నారు. షర్మిలకు పరోక్షంగా టీడీపీ నేతలు మద్దతిస్తూ వచ్చారు. కానీ, ఇప్పుడు సడన్ గా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సమయంలో సంచలనంగా మారాయి. పల్నాడు జిల్లాలో చంద్రబాబు తన ఎన్నికల ప్రచారంలో.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యపై ఆయన కుమార్తె పోరాటానికి అండగా నిలిచామని.. కానీ ఆ మె ఇప్పుడు షర్మిలకు, కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రచారం చేస్తోందని, ఇది రాష్ట్ర ప్రజలకు చేటు తెస్తుందని స్పష్టం చేశారు.

Chandra Babu suddenly changes his voice against Sharmila and Sunitha whats the reason details here

సునీత తీరు పై ఆగ్రహం
దీనికి కొనసాగింపుగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. తల్లి, ఒక కొడుకు, ఒక కూతురు రాష్ట్రంలో డ్రామాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే తల్లి కాంగ్రెస్‌ నాటకాలాడుతోంది. పిల్ల కాంగ్రెస్ తో కలిసి డ్రామాలు రక్తి కట్టిస్తోందన్నారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు టీడీపీ కూటమికి పడకుండా.. చెల్లి షర్మిల తల్లి కాంగ్రెస్‌ ద్వారా ఓట్లు చీల్చాలనుకుంటోందని చెప్పుకొచ్చారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వన న్న జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మాటలకు తూట్లు పొడిచి వైసీపీకి సహాయం చేయడమే నని వ్యాఖ్యానించారు. అన్నా చెల్లెళ్ల మధ్య కుటుంబ సమస్య ఉంటే అది కుటుంబం లోనే తేల్చుకోవాలి. అలాకాకుండా ఇలా రాజకీయాల పేరుతో ఐదుకోట్ల మంది జీవితాలను రోడ్లమీద కు ఈడ్చడం సరికాదన్నారు. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Chandra Babu suddenly changes his voice against Sharmila and Sunitha whats the reason details here

ఓట్ల చీలకే కారణమా
ఈరోజు నుంచి ఇదే అంశాన్ని ఎజెండాగా జనంలోకి తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పారు. అయితే, చిలకలూరిపేట సభలో ప్రధాని మోదీ సైతం షర్మిల - జగన్ కు పరోక్షంగా సాయం చేస్తున్నారని..ఎన్డీఏ కూటమి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ తరువాత చంద్రబాబు ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ -వామపక్ష కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుతుందనే లెక్కలు..అంచనాల తో చంద్రబాబు ఇప్పుడు ఈ తరహా ప్రచారం మొదలు పెట్టారనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇప్పటి వరకు జగన్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తూ వచ్చిన షర్మిల, సునీత ఇప్పుడు చంద్రబాబు వ్యాఖ్యల తరువాత ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+