ఆత్మ‌గౌర‌వం కాపాడుకుందాం : కుట్ర‌ల‌ను తిప్పి కొడుదాం: సీయం చంద్ర‌బాబు పిలుపు..!

ఏపి పై కుట్ర‌లు చేస్తున్న ముగ్గురు మోదీల‌ను తిప్పి కొట్టాల‌ని టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పార్టీ కేడ‌ర తో ఎన్నిక‌ల స‌న్నాహ‌క స‌మావేశాలు ఈ రోజుతో ముగిసాయి. ప్ర‌తీ స‌భ‌లోనూ చంద్రబాబు ముగ్గురు మోదీలంటూ ప్ర‌ధాని.. కేసీఆర్‌..జ‌గ‌న్ ల‌ను లక్ష్యంగా చేసుకొని విమ‌ర్శ‌లు గుప్పించారు. వివేకా హ‌త్య పైనా తీవ్ర వ్యాఖ్య‌లు చేసారు. జ‌గ‌న్ ది నేర సంస్కృతి అంటూ విరుచుకుప‌డ్డారు.

Chandra Babu target jagan : call for protect self respect with voting for TDP

అమ‌రావ‌తి వ‌ద్దు..లోట‌స్ పాండ్ ముద్దు..


జగన్‌.. నరేంద్రమోదీది విడదీయలేని జోడీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతిపరులకు మోదీ కాపు కాస్తున్నారు. దేశాన్ని మోదీ భ్రష్టుపట్టించారు. గుజరాత్‌లో మోదీ ముస్లింలను ఊచకోత కోశారు. మోదీతో విభేదించినందుకు నాపై కక్షకట్టారు. ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో ముస్లింలకు అండగా ఉన్నా. మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటే జగన్‌ వెన్నులో వణుకు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ లాలూచీ రాజకీయాలు. ఫ్యాన్‌ ఇక్కడ, స్విచ్‌ తెలంగాణలో, కరెంట్‌ ఢిల్లీలో. జగన్‌కు అమరా వతి వద్దు... లోటస్‌పాండ్‌ ముద్దు అంటూ చంద్ర‌బాబు ఎద్దేవా చేసారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యను గుండెపోటు గా ఎందుకు ప్రచారం చేశారని వైకాపా నేతలను తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అపరాధ భావంతో ఉన్న వ్యక్తి మరిన్ని తప్పులు చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. శవపరీక్ష నివేదిక వచ్చాక మాట మార్చారని.. ఇదేం ప్రవర్తన అని చంద్రబాబు నిలదీశారు.

మోదీ అండ‌తోనే..
వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తు కావాలని జగన్‌ గవర్నర్‌ వద్దకు వెళ్లారని.. ప్రధాని మోదీ అండ చూసుకునేనా అంటూ చం ద్రబాబు ప్రశ్నించారు. హ‌త్యతో మీకు సంబంధం లేకుంటే ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు. నేరస్థుడు ఎలా ప్రవర్తిస్తాడో కడప జిల్లా ప్రజలు గమనించాలి. గుజరాత్‌ ఘటనలో మోదీ రాజీనామా చేయాలని కోరిన వ్యక్తి నేనే. చట్టం అందరికీ సమానంగా ఉండాలి.. ముస్లింలకు తలాక్‌ చట్టం ఎందుకు తీసుకొచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు. ఏపి ప్ర‌జ‌ల పౌరుషం.. ఆత్మ‌గౌర‌వం చాటాల్సిన స‌మ‌యం వ‌చ్చింద‌న్నారు. జ‌గ‌న్ కు ఓటు వేస్తే అది కేసీఆర్‌..మోదీకి వేసిన ట్లేన‌ని విశ్లేషించారు. కేసీఆర్ ద‌గ్గ‌ర డ‌బ్బులు తీసుకొని ఆయ‌న‌కు జ‌గ‌న్ ఊడిక‌న చేస్తున్నార‌ని ఆరోపించారు. జ‌గ‌న్ అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో ర‌క్ష‌ణ ఉండ‌ద‌ని..పెట్టుబడులు పెట్టే వారు రార‌ని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+