జగన్ "బలం" పై చంద్రబాబు కొత్త అస్త్రం - గెలుపెవరిది..!!

విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్సాను అభ్యర్దిగా ప్రకటించారు. పార్టీకి మెజార్టీ ఓటర్ల మద్దతు ఉండటంతో జగన్ వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. బెంగళూరులో క్యాంపు ఏర్పాటు చేసి వారిని తరలించారు. ఇదే సమయంలో కూటమి ఈ ఎన్నికలో గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ రోజు చంద్రబాబు పార్టీ నేతల సమీక్షలో అభ్యర్దిని ఖరారు చేయటంతో పాటుగా ఎన్నికల వ్యూహాన్ని ఫైనల్ చేయనున్నారు.

చంద్రబాబు సమీక్ష
ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎలాగైనా ఆ ఎన్నికను గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు విశాఖ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ రానుంది. ఎమ్మెల్సీ సీటును ఎలాగైనా గెలుచుకోవాలనే పట్టుదలతో టీడీపీ ఉంది. విశాఖ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపుతో ఎమ్మెల్సీ సీటూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ బరిలోకి దించింది.

Chandra Babu to take key decision over Vizag MLC Election with party leaders

ఎన్నికల వ్యూహం
కూటమి నుంచి ఎవరిని ఈ ఎన్నిక రేసులో సీఎం చంద్రబాబు పెడతారనే ఉత్కంఠ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతోంది. టీడీపీ నుంచి పీలా గోవిందు పేరు దాదాపు ఖరారైంది. ఇదే సమయంలో గండి బాబ్జీ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి బలం లేకపోయినా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూ ఎన్నికల్లో పోటీ చేస్తుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తాజాగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల్లోనూ కూటమి పూర్తి స్థాయిలో విజయం సాధించింది. దీంతో, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విజయం తమదేనని కూటమి నేతలు ధీమాగా ఉన్నారు.

జగన్ ధీమాతో
అట జగన్ ఎలాగైనా ఈ ఎన్నిక గెలవాలని ప్రయత్నిస్తున్న సమయంలో చంద్రబాబు తాజా సమీక్ష కీలకంగా మారుతోంది. దాదాపు 800 మంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో వైసీపీకి 600 మంది ఓటర్ల మద్దతు ఉండగా..టీడీపీకి 200 మంది మద్దతుగా నిలుస్తున్నారు. గ్రేటర్ విశాఖ కార్పోరేటర్లలో మరో 15 మంది టీడీపీలో చేరటానికి రంగం సిద్దమైంది. దీంతో, ఎన్నికలో గెలుపు కోసం చంద్రబాబు ఎలాంటి దిశా నిర్దేశం చేస్తారు..ఎన్నికల్లో గెలుపు ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాజకీంగా ఆసక్తి కరంగా మారుతోంది?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+