షాక్: మోడీ కేబినెట్లోకి పురంధేశ్వరి, వెదిరే శ్రీరామ్‌ను అడ్డుకున్న బాబు, సుజన చక్రం, అందుకే?
ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగువారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరు బాగా వినిపించింది. కానీ వారికి అవకాశం దక్కలేదు.
Recommended Video

హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ తాజా కేబినెట్ విస్తరణలో తెలుగువారికి ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. ఏపీ నుంచి హరిబాబు, తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరు బాగా వినిపించింది. కానీ వారికి అవకాశం దక్కలేదు.

చంద్రబాబు అడ్డుకున్నారని ప్రచారం
మోడీ కేబినెట్లో తెలుగు వారికి చోటు దక్కకపోవడంపై ఓ ఆసక్తికర మరియు షాకింగ్ ప్రచారం సాగుతోంది. ఏపీ నుంచి ఒకరికి, తెలంగాణ నుంచి ఒకరి పేరును బిజెపి అధిష్టానం పరిశీలించిందని, కానీ సీఎం చంద్రబాబు మోకాలు అడ్డారనే ప్రచారం సాగుతోంది.

పురంధేశ్వరికి అడ్డుకున్న బాబు
ఏపీ నుంచి హరిబాబు కంటే ముందు.. మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి పేరును బిజెపి అధిష్టానం పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో చంద్రబాబు వెంటనే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సమాచారం పంపించారని అంటున్నారు.

పొత్తు పైనే దెబ్బ పడుతుందని షాకు సుజన హెచ్చరిక
పురంధేశ్వరి పేరు తెరపైకి రాగానే టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి ద్వారా బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు చంద్రబాబు తన అసంతృప్తిని వెళ్లగక్కారని సమాచారం. పురంధేశ్వరిని కేబినెట్లోకి తీసుకుంటే పొత్తు పైనే దెబ్బ పడుతుందని సుజన.. షాకు తేల్చి చెప్పారని తెలుస్తోంది.

అందుకే చంద్రబాబు అసంతృప్తిని పరిగణలోకి తీసుకున్న బిజెపి
ఇప్పటికే నంద్యాల ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత కాకినాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి జోరు కనిపించింది. దీంతో 2019 ఎన్నికల నాటికి టిడిపికి దూరంగా జరగాలని నిన్నటి వరకు భావించిన బిజెపి, ఈ ఫలితాల తర్వాత పునరాలోచన చేసింది. ఈ నేపథ్యంలో టిడిపి అసంతృప్తిని బిజెపి పరిగణలోకి తీసుకున్నదని తెలుస్తోంది. ఆ తర్వాత హరిబాబు పేరు తెరపైకి వచ్చిందని సమాచారం.

ఏపీ వ్యతిరేకిగా వెదిరే శ్రీరామ్
తెలంగాణ నుంచి వెదిరే శ్రీరామ్ పేరును కూడా బిజెపి అధిష్టానం పరిశీలించింది. ఇతను ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్. అలాగే యాంటీ ఏపీగా ముద్రపడ్డారు. ఏపీకి చెందిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు కూడా ఎక్కారు.

వెదిరె శ్రీరామ్‌పై బాబు అందుకే అభ్యంతరం
అంతేకాదు, యూనియన్ ఇరిగేషన్ మినిస్ట్రీ సలహాదారుగా పలు నీటి పారుదల సమస్యలపై ఏపీ వ్యతిరేక వైఖరిని అవలంభించారని అంటారు. ఈ కారణంగా ఈయన పేరుపై కూడా చంద్రబాబు అభ్యంతరాలు వ్యక్తం చేశారనే ప్రచారం సాగుతోంది. దీంతో బిజెపి ఇద్దరు తెలుగువారిని పక్కన పెట్టిందని అంటున్నారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్












Click it and Unblock the Notifications