ఫోన్ ట్యాపింగ్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసిన చంద్రబాబు - జీవితాంతం జైలులోనే..!!

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డేటా చోరీపై ఏపీ అసెంబ్లీ తేల్చేసింది. చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లుగా అనుమానిస్తోన్న ఈ వ్యవహారంపై స‌భా సంఘం ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తన మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో చోటు చేసుకున్న చర్చలపై మాట్లాడారు. డేటా చోరీ వాస్త‌వ‌మేనని తేల్చి చెప్పారు. డేటా చోరీపై నిగ్గు తేల్చడానికి దుకు నాలుగు ద‌ఫాలు తాము స‌మావేశ‌ం అయ్యామని, వివిధ శాఖ‌ల అధికారులు, సంబంధిత నిపుణుల‌తో చ‌ర్చించామ‌ని చెప్పారు.

సేవా మిత్ర అనే యాప్‌ను టీడీపీ దుర్వినియోగం చేసింద‌ని తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. ఈ యాప్‌ను అడ్డు పెట్టుకుని పౌరుల ప్రాథమిక హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాసే ప్రయత్నాలకు తెర తీసిందని, డేటాను చోరీ చేసి, దాన్ని తన స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వాడుకుంద‌ని భూమ‌న తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాయని భావిస్తోన్న 30 ల‌క్ష‌ల ఓట్ల‌ను తొల‌గించడానికి టీడీపీ ప్ర‌య‌త్నించినట్లు చెప్పారు.

ఇదివరకటి చంద్రబాబు ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడిందనే విషయం ప్రాథ‌మికంగా నిర్ధారణకు వచ్చింని అన్నారు. ఈ డేటా చోరీపై మ‌రింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు. త‌మ‌కు ఓటు వేయ‌రనుకున్న వాళ్లందరి స‌మాచారాన్ని టీడీపీ స్టేట్ డేటా సెంట‌ర్ నుంచి సేవామిత్ర యాప్ ద్వారా నిందితులు చోరీ చేయడానికి ప్రయత్నిచినట్లు గుర్తించారు. డేటా చోరీ జ‌రిగిందంటూ అసెంబ్లీ కమిటీ ప్రాథ‌మికంగా ఓ నిర్ధార‌ణ‌కు వ‌చ్చిందని చెప్పారు.

Chandrabab most dangerous than Dera Baba, Minister Roja hits out at TDP Chief

దీనిపై పర్యాటక శాఖ మంత్రి రోజా స్పందించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. డేరా బాబా కంటే చంద్రబాబు మోస్ట్ డేంజరస్ అని హెచ్చరించారు. డేటాను చోరీ చేసిన చంద్రబాబు డేరాబాబా కంటే ప్రమాదకరమైన వ్యక్తిగా వ్యాఖ్యానించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా డేటా చొరీ వ్యవహారాన్ని ప్రస్తావించారని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ సాక్ష్యాధారాలను తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగ పర్చట్లేదని చెప్పారు. దీనిపై చంద్రబాబు స్టే తెచ్చుకోకుండా కోర్టుకు వెళ్తే ఖచ్చితంగా జీవితాంతం జైలులో ఉంటాడని జోస్యం చెప్పారు. చంద్రబాబు.. డేరా బాబా కంటే లేటెస్ట్ డేంజరస్ అని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+