చంద్రబాబు ట్యాపింగ్‌ సెట్టర్‌ - జగనన్న ట్రెండ్‌ సెట్టర్‌ : అడ్మినిస్ట్రేషన్ కు అబ్రివేషన్ - సభలో రోజా..!!

ఏపీ శాసనసభలో ముఖ్యమంత్రి జగన్ పైన నగరి ఎమ్మెల్యే రోజా ప్రశంసల వర్షం కురిపించారు. పంచ్ లతో చంద్రబాబును టార్గెట్ చేసారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఎమ్మెల్యే రోజా ఈ మూడేళ్ల పాలనలో అమలు చేసిన పధకాలను ప్రస్తావించారు. జగన్ పాలన సూపర్ అంటూ ప్రశంసించారు. గడిచిన మూడేళ్ల పాలన చూస్తే మా రాజన్నే అధికారంలో ఉన్నాడని ప్రతీ గుండె గర్వ పడుతోందన్నారు. మూడేళ్లుగా తన పనితీరు చూశాక వైయస్‌ జగన్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఏపీ నిలిచిందని చెప్పారు.

నీతి అయోగ్ ర్యాంకులు ఏపీకే

నీతి అయోగ్ ర్యాంకులు ఏపీకే

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గుడ్‌ గవర్నెన్స్‌ ర్యాంకుల్లో ఏపీ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉందని వివరించారు. రాష్ట్రంలో సమర్ధవంతంగా కరోనాను ఎదుర్కోవడంలో దేశంలోనే ఏపీ మూడోవ ర్యాంకును పొందిందని చెప్పుకొచ్చారు. సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వం దేశంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచిందని ప్రకటించారు. వరుస రెండో ఏడాది మన ప్రభుత్వం మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. గ్రామీణాభివృద్ధి, శాంతిభద్రతలు, జిల్లా పరిపాలన, వ్యవసాయ విభాగాల్లో మన రాష్ట్రం తొలి స్థానంలో నిలిచిందని రోజా చెప్పారు.

గన్ లాంటి వ్యక్తి జగన్

గన్ లాంటి వ్యక్తి జగన్

తిరుపతిలో మా వెంకన్న ఫేమస్‌..బెజవాడలో మా కనకదుర్గమ్మ ఫేమస్, వైజాగ్‌లో సింహాద్రి అప్పన్న ఫేమస్, సుపరిపాలనలో మా జగనన్న ఫేమస్‌ అని చెప్పుకొచ్చారు. సుపరిపాలనకైనా, సమగ్రాభివృద్ధి అయినా వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని తెలుసుకోవాలని ఎమ్మెల్యే రోజా సూచించారు. గన్‌ పట్టుకున్న వంద మంది వేస్ట్‌వాళ్లకంటే గన్‌ లాంటి ఒక్కరు ఉంటే చాలు అంటారని.. ఆ గన్‌ లాంటి వ్యక్తి జగనన్న అని చెప్పుకొచ్చారు. గడిచిన మూడేళ్లలో వైయస్‌ జగన్‌ రూ. 1,32,126 కోట్లను 25 డీబీటీ పథకాల ద్వారా అందించారని చెప్పారు.

మా సీఎం ట్రెండ్ సెట్టర్

మా సీఎం ట్రెండ్ సెట్టర్

ఇందులో బీసీలకు రూ.63,327 కోట్లు, ఎస్సీలకు రూ.21,531 కోట్లు, ఎస్టీలకు రూ.6847 కోట్లు, మైనారిటీలకు రూ.5,160 కోట్లు, కాపులకు రూ.11572 కోట్లు, ఇతరులకు రూ.23,686 కోట్లను అందించారని లెక్కలు వివరించారు. అడ్మినిస్ట్రేషన్‌కు అసలైన అబ్రివేషన్‌ ఎలా ఉంటుందో ఈ రాష్ట్రానికే కాదు దేశానికి వైయస్‌ జగన్‌ చాటిచెబుతున్నారని ప్రశంసించారు. చంద్రబాబు ఫోన్‌ట్యాపింగ్‌ చేయిస్తే..జగనన్న సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. టెక్నాలజీతో చంద్రబాబు ట్యాపింగ్‌ సెట్టర్‌ అయితే..జగనన్న ట్రెండ్‌ సెట్టర్‌ అని వ్యాఖ్యానించారు.చంద్రబాబు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ 420 హిస్టరీ గా పేర్కొన్నారు. జగనన్న త్రీ ఇయర్స్‌ ఇండస్ట్రీ 543 సర్వీసెస్‌ హిస్టరీ అంటున్నారని చెప్పారు. ఈ బడ్జెట్లో మహిళల అభివృద్ధికి రూ. 55115 కోట్లు అంటే దాదాపుగా 84 శాతం కేటాయించారని ఎమ్మెల్యే ఆర్కే రోజా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+