ముందే న్యాయం: సిమెంట్ వేదికపై బాబు దీక్ష (పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణపై తాము వెనక్కి తగ్గలేదని అయితే, సీమాంధ్రకు విభజనకు ముందే న్యాయం చేయాలనేది తమ ప్రధానమైన డిమాండ్ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. సమన్యాయం కోరుతూ బాబు న్యూఢిల్లీలోని ఎపి భవన్లో ఆమరణ దీక్ష చేస్తున్నారు.
మంగళవారం బాబు దీక్ష రెండో రోజుకు చేరుకుంది. సోమవారం దీక్ష సమయంలో ఆయన కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఎన్నికల ముందు రాజకీయ లబ్ధి కోసమే ఇలా చేసిందని ఆరోపించారు. కాంగ్రెసు కళ్లు తెరిపిస్తామని, సీమాంధ్రులకు న్యాయం జరిపిస్తామని చెప్పారు.
కాగా చంద్రబాబు దీక్ష ఎపి భవన్ అధికారులను గందరగోళంలో పడేసింది. కేబినెట్ హోదా కలిగిన బాబు విలేకరుల సమావేశం కోసం కాన్ఫరెన్స్ హాల్‌కు అనుమతి తీసుకున్నారు. విలేకరుల సమావేశం కాగానే బాబు నేరుగా అక్కడే ప్రాంగణంలో ఉన్న సిమెంట్ వేదిక పైన దీక్షకు కూర్చున్నారు. ఇది గందరగోళానికి దారి తీసింది. ఎపి భవన్ అధికారులు దీక్షకు అనుమతి లేదని చెప్పారు. అయినా బాబు అందుకు నిరాకరించి దీక్షకు కూర్చున్నారు.

బాబు 1
న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో విభజన తీరును నిరసిస్తూ ఆమరణ దీక్ష చేసేందుకు వెళ్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

బాబు 2
న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో విభజన తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.

బాబు 3
న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో విభజన తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. పక్కన టి నేత నామా నాగేశ్వర రావు, సీమాంధ్ర నేత పయ్యావుల కేశవ్.

బాబు 4
న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో విభజన తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. నేతలతో మాట్లాడుతున్న బాబు.

బాబు 5
న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో విభజన తీరును నిరసిస్తూ ఆమరణ దీక్షకు దిగిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. పక్కన నామా నాగేశ్వర రావు, పయ్యావుల కేశవ్.

బాబు 6
విభజన తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో దీక్ష చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం.

బాబు 7
విభజన తీరును నిరసిస్తూ న్యూఢిల్లీలోని ఎపి భవన్‌లో దీక్ష చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు విలేకరులతో మాట్లాడుతున్న దృశ్యం. క్విట్ కాంగ్రెస్ సేవ్ తెలుగు పీపుల్ అంటూ ప్లకార్డుల ప్రదర్శన.

బాబు 8
ఢిల్లీలోని ఎపి భవన్‌లో విభజన తీరును నిరసిస్తూ టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతు తెలుపుతున్న మహిళా టిడిపి నేతలు.

బాబు 9
ఎపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు పలువురు జాతీయ నాయకులు సంఘీభావం తెలిపారు.

బాబు 10
అంతకుముందు న్యూఢిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద విలేకరులతో మాట్లాడారు.

బాబు 11
అంతకుముందు న్యూఢిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

బాబు 12
అంతకుముందు న్యూఢిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించినప్పుడు మహిళా నేత తిలకం దిద్దుతున్న దృశ్యం.

బాబు 13
న్యూఢిల్లీకి బయలుదేరే ముందు చంద్రబాబు నాయుడు హైదరాబాదులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన సమయంలో ఇరు ప్రాంతాల టిడిపి నేతలు ఆయనతో ఉన్నారు.












Click it and Unblock the Notifications