వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రానికిఅన్యాయం: మరోసారి కేంద్రంపై చంద్రబాబు మండిపాటు

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: కేంద్రంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖాధిపతులు, కార్యదర్శులు, మంత్రులతో ఆయన శుక్రవారం సమావేశమయ్యారు.

ఆ సమావేశంలో కేంద్రం విడుదల చేసిన నిధులపై వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అవసరమైన నిధులు ఇవ్వలేని, విభజన హామీలు నెరవేర్చలేదని ఆయన అన్నారు. బడ్జెట్ రూపకల్పనపై ఆయన సమావేశంలో చర్చించారు.

 ప్రజలు మోసపోయామని భావిస్తే...

ప్రజలు మోసపోయామని భావిస్తే...

మోసపోయామని ప్రజలు భావిస్తే వాళ్లు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉంటాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన అన్నారు, కేంద్రం నుంచి సక్రమంగా నిధులు రాలేదని ఆయన అన్నారు.

ప్రాధాన్యతా క్రమంలో నిధులు

ప్రాధాన్యతా క్రమంలో నిధులు

ప్రాధాన్యతా క్రమంలో లక్ష్యాలను నిర్దేశించుకుని నిధులు ఇస్తున్నామని, దానివల్ల సానుకూల ఫలితాలు వచ్చాయని చంద్రబాబు అన్నారు. పంచాయతీ రాజ్ శాఖకు ఎన్నో పురస్కారాలు వచ్చాయని, జల వనరుల శాఖ మంచి ఫలితాలు సాధించిందని ఆయన చెప్పారు.

 కొన్ని శాఖల్లో ఇలా

కొన్ని శాఖల్లో ఇలా

అన్ని శాఖల్లో సంస్కరణలు చేపట్టామని, మంచి ఫలితాలు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. కొన్ని శాఖలు వెనకబడి ఉన్నాయని ఆయన అన్నారు. అవసరమైతే ప్రస్తుత చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెస్తామని ఆయన చెప్ారు. వర్షపాతం తక్కువగా ఉన్నా కూడా విద్యుత్తు వినియోగం తగ్గందని, భూగర్భజలాలు పెంచుకోగలిగామని అన్నారు.

 వనరులున్నా కూడా...

వనరులున్నా కూడా...

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో వనరులున్నా అభివృద్ధిలో వెనకబడి ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోగలిగామని చెప్పారు. 15 శాతం వృద్ధి సాధించాలన్నదే లక్ష్యమని అన్నారు.

 హరిబాబు సవాల్‌కు రెడీ

హరిబాబు సవాల్‌కు రెడీ

బిజెపి ఎంపీ హరిబాబు చెప్పిన లెక్కలపై చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు అన్నారు. చెప్పిందే హరిబాబు మళ్లీ చెప్పారని ఆయన అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులపై ఇప్పటికే నాలుగు శ్వేత పత్రాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు. అందరి అనుమానాలు తొలగించేందుకు శ్వేతపత్రం విడుదల చేస్తామని అన్నారు.

 మోడీ అలా చెప్పారు...

మోడీ అలా చెప్పారు...

ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్‌కు నిర్మిస్తామని ప్రధాని మోడీ స్వయంగా చెప్పారని గంటా శ్రీనివాస రావు గుర్తు చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కుంటిసాకులు చెప్పవద్దని ఆయన అన్నారు.

English summary
Andhra Pradesh CM Nara Chandrababu Naidu expessed dissatisfaction once again on PM Narendra Modi'sunion governnment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X