వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేవంత్ కేసులో 22సార్లు: జగన్, హైద్రాబాద్‌లో విచారణా, కెసిఆర్‌తో కలిసేం చేయలేవ్: బాబు హెచ్చరిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా విషయమై మాట్లాడుతూ... ఓటుకు నోటు కేసు ఛార్జీషీటులో చంద్రబాబు పేరును 22సార్లు ప్రస్తావించారని వ్యాఖ్యానించారు. దీంతో సభలో గందరగోళం చెలరేగింది.

టిడిపి సభ్యులు మాట్లాడుతూ.. అది తప్పుడు కేసులని, అయినా తాము జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించలేదని, ఇప్పుడు జగన్ అలా మాట్లాడటం విడ్డూరమన్నారు. టిడిపి సభ్యులు తీవ్రంగా మండిపడగా.. సీఎం చంద్రబాబు సభలో మాట్లాడారు.

ఆవేశానికి లోను కావొద్దు.. దారుణమైన అసెంబ్లీ

టిడిపి సభ్యులు ఎవరు కూడా ఆవేశానికి లోను కావొద్దని చంద్రబాబు సూచించారు. అది వారి (వైసిపి) చరిత్ర, మనం మాత్రం సంయమనం పాటించాలన్నారు. వారి తీరు అది అన్నారు. వారి చరిత్ర అంద దారుణంగా ఉంటుందన్నారు. ఇంత దారుణమైన అసెంబ్లీని నా జీవితంలో చూడలేదన్నారు.

Chandrababu alleged YS Jagan and KCR conspiracy

దానికి కారణం జగన్ నేర చరిత్ర అన్నారు. మేం సంయమనం పాటిస్తామని చెప్పారు. ఎవరు ఆవేశపడవద్దన్నారు. ఈ రోజు వారు ఎన్ని విషయాలు మాట్లాడినా ధర్మం, న్యాయం మా వైపు ఉందన్నారు.

11 ఛార్జీషీటులు పెట్టుకొని నాపైనా

11 ఛార్జీషీట్లు పెట్టుకొని, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వారు నా గురించి మాట్లాడుతారా అని చంద్రబాబు ఊగిపోయారు.

కెసిఆర్‌తో కుమ్మక్కు

తెలంగాణ సిఎం కెసిఆర్‌తో కుమ్మక్కై నా గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు. కెసిఆర్, జగన్ నా పైన కుట్ర పన్నారన్నారు. నీవు హరీష్ రావును ఎక్కడ కలిశావో మా వద్ద డాక్యుమెంట్ ఉందని చెప్పారు. నా పైన కుట్రతో కేసులు పెట్టారన్నారు. మీరిద్దరు కలిసినా నన్నేం చేయలేరన్నారు.

నీ తండ్రి వల్లే కాలేదు, నీవు ఎంత అన్నారు. మీ ప్రవర్తన బాగా లేదన్నారు. నేను ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు పోలేదన్నారు. నా స్పీచ్ చూడవచ్చునని చెప్పారు. మాట్లాడితే వారు పోడియం వద్దకు దూసుకు వస్తారన్నారు. ఇష్టానుసారం మాట్లాడితే చల్లదన్నారు.

జగన్ చెప్పిందే చెబుతారని, ఓ పేపర్ (సాక్షి) ఉంది కదా అని దానిని హెడ్ లైన్లో వేస్తారన్నారు. కామన్ క్యాపిటల్లో తన పైన విచారణ చేపట్టే అధికారం వారికి టిఆర్ఎస్‌కు ఎక్కడిదన్నారు. నేను ఏ తప్పు చేయలేదన్నారు. వీరు వారు కలిసి ఏదో చేయాలనుకుంటున్నారని, అసలు వి,యానికి రావాలన్నారు.

ప్రతిపక్షం ఇలా ఉండటం దురదృష్టకరమని, కానీ వీళ్లను భరించక తప్పదన్నారు. అసెంబ్లీ పవిత్ర దేవాలయం అని, బూతులు మాట్లాడుతావా, కెసిఆర్‌తో కుమ్మక్కై నా పైన అబద్దాలు చెబుతారా అన్నారు. ఉమ్మడి రాజధానిలో ఓ సిఎం పైన విచారణ చేపట్టే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

నా జీవితంలో ఎప్పుడు చూడని సంఘటనలను సభలో చూశానని చెప్పారు. వారు ఎంత రెచ్చిపోయినా మేం రెచ్చిపోమని, మేం సభాపతికి సహకరిస్తామన్నారు. ప్రజలు ఆలోచించాలన్నారు.

సభలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి హక్కులు ఇస్తారనే విషమయై చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మీ తండ్రి ఉన్నప్పుడు మీ టీవీలే సభలో పెట్టుకున్నారని, కనీసం మాకు మైకులు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు కనీసం మీకు మైకులు ఇస్తున్నాం ఆనందించాలన్నారు. అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతానని చెప్పారు.

English summary
Chandrababu alleged YS Jagan and KCR conspiracy with Cash for Vote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X