ప్రభుత్వంపై ప్రజలు తిరగబడటానికి సిద్ధం ; కేసులు పెట్టినా టీడీపీని ఏం చెయ్యలేరు : చంద్రబాబు, అచ్చెన్న ధ్వజం
టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై, వైసీపీ సర్కార్ పాలనపై విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా ప్రభుత్వం టిడిపి నేతలను వేధింపులకు గురి చేస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు పార్టీ నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించిన చంద్రబాబు వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు. అక్రమ కేసులు పెట్టి జగన్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతోందని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో టిడిపి నేతలను అణచివేసే కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు : చంద్రబాబు
అమరావతిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన కేసులు పెట్టి ఉన్న ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని వైసిపి నేతలపై విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాలని టీడీపీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా నిరసన తెలియ చేసిన టిడిపి నాయకులను అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ధరలకు వ్యతిరేకంగా ఆందోళన చేసినందుకు చింతమనేని ప్రభాకర్ ను అరెస్టు చేశారని నిప్పులు చెరిగారు చంద్రబాబు. దేవాలయానికి వెళితే గంజాయి స్మగ్లింగ్ కేసు పెట్టాలని ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపించారు.

తప్పులు బయటపెడతారని భయంతో తప్పుడు కేసులు : చంద్రబాబు
ఉపాధి హామీ పనుల బిల్లులు చెల్లించకుండా టీడీపీ నేతలను వేధిస్తున్నారని చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడిన చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న తప్పులు బయటపడతాయని భయంతోనే టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు. సాక్ష్యాధారాలు సేకరిస్తారని భయంతో టీడీపీ నేతల ఫోన్లు కూడా లాక్కుంటున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. తిరగబడితే ప్రభుత్వం తోక ముడుస్తుందని, ప్రజలు కూడా తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీని అడ్డుకోవటం కోసం సామ, దాన, భేద, దండోపాయాలు : అచ్చెన్నాయుడు
ఇక మరోవైపు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం వైసీపీ పాలన పై విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డారని, ప్రతిపక్షంలో ప్రజా సమస్యలపై ఉద్యమిస్తామని అచ్చెన్నాయుడు తెలిపారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుండి టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టడం మొదలు పెట్టారని, టీడీపీని అడ్డుకోవటం కోసం సామ, దాన, భేద, దండోపాయాలను జగన్ ఉపయోగిస్తున్నారని అచ్చెన్న నిప్పులు చెరిగారు. టిడిపి కార్యకర్తలకు ఆత్మస్థైర్యం ఉన్నంతవరకూ టీడీపీని ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

ఎన్ని కేసులు పెట్టినా టీడీపీని ఏం చెయ్యలేరు: అచ్చెన్న
ఎన్ని కేసులు పెట్టినా ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తూనే ఉంటారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బీసీలకు 56, ఎస్సీలకు 3 కార్పొరేషన్ ల పేరుతో జగన్ హడావుడి చేస్తున్నారని, కానీ కనీసం రూపాయి బడ్జెట్ కూడా కేటాయించలేదని అచ్చెన్న విమర్శించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ ధరల పెంపుతో పేదలపై విపరీతమైన భారం మోపుతున్నారని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు

జగన్ అండతో రాష్ట్రంలో అరాచక శక్తులు
రాష్ట్రంలో వైసిపి అరాచక పాలన సాగిస్తోందని, ప్రశ్నిస్తే వేధింపులకు గురి చేస్తుందని టిడిపి నేతలు సైతం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసుల దృష్టి మొత్తం తెలుగుదేశం పార్టీ నేతల మీద అక్రమ కేసులు పెట్టడం పైనే ఉందని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు అండ చూసుకొని రాష్ట్రంలో అరాచక శక్తులు రెచ్చిపోతున్నారు అని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని నిప్పులు చెరుగుతున్నారు. జగన్ పాలనలో జనం నరకయాతన చూస్తున్నారంటూ టిడిపి నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.
-
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని












Click it and Unblock the Notifications