వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు కేశినేని దగ్గరయ్యారు-ఆ ఎంపీ ఏమయ్యారు : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరంటూ...!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ప్రతిపక్ష నేత చంద్రబాబుకు అధికారంలో ఉన్న వైసీసీ నుంచి వచ్చే సమస్యలకంటే..సొంత పార్టీలోనే ఇబ్బందులు పెరిగిపోతున్నాయి. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీ మీద అలుగుతున్నారు. పార్టీ వీడుతామంటూ హెచ్చరిస్తున్నారు. వారిని బుజ్జగించటం చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి..కేశినేని నాని లాంటి వారిని చంద్రబాబు బుజ్జగించారు. ఏకంగా పార్టీ కార్యాలయం లో చంద్రబాబు ఫొటోలు తీసేసి..రతన్ టాటా ఫొటోలు ఏర్పాటు చేసిన కేశినేని నాని..పార్టీ కార్యాలయం పైన దాడి.. చంద్రబాబు దీక్ష సమయంలో తన మనసు మార్చుకున్నారు.

మనసు మార్చుకున్న కేశినేని

మనసు మార్చుకున్న కేశినేని


వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేయనంటూ కేశినేని మద్దతు దారులు ప్రచారం చేసారు. అయితే, చంద్రబాబు దీక్షకు వెళ్లి మద్దతు ప్రకటించటం..ఆ సమయంలో కేశినేని నానితో చంద్రబాబు ఏకాంతంగా సమావేశం కావటంతో ఆ సమస్య ముగిసిపోయింది. చంద్రబాబు ఢిల్లీ టూర్ లోనూ కేశినేని నాని కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇదే సమయంలో మరో ఎంపీ గల్లా జయదేవ్ పైన పార్టీలో చర్చ మొదలైంది. గుంటూరు నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ లోక్ సభ నాయకుడిగా ఉన్నారు.

గల్లా జయదేవ్ దూరానికి కారణమేంటి

గల్లా జయదేవ్ దూరానికి కారణమేంటి

గల్లా కుటుంబానికి చంద్రబాబుకు చాలా కాలంగా సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రగిరి నుంచి జయదేవ్ తల్లి గల్లా అరుణ ఎమ్మెల్యేగానూ పని చేసారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే, కొద్ది కాలంగా గల్లా కుటుంబం పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటుందనే ప్రచారం సాగుతోంది. పార్టీ కార్యాలయం పైన దాడి జరిగినా..గల్లా అక్కడకు రాలేదు. పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష చేసినా సంఘీభావం ప్రకటించలేదు. స్వయంగా హాజరు కాలేకపోయినా..పత్రికా ప్రకటన ద్వారా కూడా తన అభిప్రాయం వెల్లడించక పోవటం పలు రకాల చర్చలకు కారణం అవుతోంది.

ఢిల్లీ పర్యటనలో కనిపించని ఎంపీ

ఢిల్లీ పర్యటనలో కనిపించని ఎంపీ

ఇక, చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పార్టీ లోక్ సభ ఫ్లోర్ లీడర్ గా ఉన్న గల్లా జయదేవ్ కనిపించకపోవటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీల్లో కేశినేని నాని..రామ్మోహన్ నాయుడు పార్టీ అధినేతతో ఉన్నారు. కానీ, గల్లా మాత్రం చంద్రబాబు రెండు రోజులు ఢిల్లీలో ఉన్న ఎక్కడా కనిపించలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. దశాబ్దాల కాలంగా చిత్తూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామిక కుటుంబంగా ఉన్న గల్లా ఫ్యామిలీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొన్ని ఇబ్బందులు ఎదుర్కోంటోంది.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే ప్రచారం

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరనే ప్రచారం

గత నెలలో కోర్టు ఆదేశాల మేరకు గల్లా జయదేవ్ తో పాటు మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 14 మందిపై భూ ఆక్రమణల కేసు నమోదు అయ్యింది. అమరావతి రైతులకు మద్దతుగా ఎంపీ గల్లా పోరాటం చేసారు. ఇప్పుడు అసలు నియోజకవర్గంలోనే ఆయన పార్టీ కార్యాకలాపాల్లో పాల్గొనటం లేదు. తమ పైన అధికార పార్టీ ఉద్దేశ పూర్వకంగా వేధింపులకు పాల్పడుతోందని గల్లా మద్దతు దారులు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ నుంచి మద్దతు లభించటం లేదనేది వారి ఆవేదనగా తెలుస్తోంది.

పార్టీలో మొదలైన చర్చ...భిన్న వాదనలు

పార్టీలో మొదలైన చర్చ...భిన్న వాదనలు

గల్లా ప్రస్తుతం ఎంపీగా ఉన్నా..వచ్చే ఎన్నికల్లో మాత్రం గుంటూరు నుంచి పోటీ చేయరనే ప్రచారం పార్టీలో బలంగా వినిపిస్తోంది. పార్టీలో కొన్ని పదవులు కేటాయింపు... ప్రాధాన్యతల విషయంలోనూ గల్లా ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే, పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా ఎంపీ జయదేవ్ గతంలో లాగా యాక్టివ్ గా లేకపోవటంతో ఆయన రాజకీయ భవిష్యత్.. టీడీపీలో కొనసాగటం పైన అనేక రకాల వాదనలు తెర మీదకు వస్తున్నాయి. చంద్రబాబు సొంత జిల్లా.. సొంత నియోజకవర్గానికి చెందిన కుటుంబం ఇప్పుడు పార్టీలో యాక్టివ్ లేకపోవటం.. దూరమవుతున్నారనే ప్రచారం నడుమ ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
Amid the differences between Chandrababu and Kesineni, news is making rounds that both have patched up and Galla Jayadev is maintaining the distance with TDP Chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X