అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ: సీట్ల పంపకాలపై చర్చ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. గురువారం రాత్రి వరకు సుమారు గంటన్నరపాటు వీరి సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల సీట్ల పంపకాల విషయంలో చర్చ జరిగింది.
ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే, శుక్రవారం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు, సీట్ల పంపకాలపై ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకి సంబంధించి చంద్రబాబు కొన్ని రోజుల క్రితం అమిత్‌షాతో భేటీ అయ్యారు. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మరోసారి సమావేశం అయ్యారు.

కాగా, బుధవారం చంద్రబాబుతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో సమావేశం జరిగింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీలైనంత త్వరగా అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించాలనే నిర్ణయానికి వచ్చారు. మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు - పవన్ కల్యాణ్ కీలక చర్చలు జరిపారు.
ఢిల్లీలో శ్రీ అమిత్ షా, శ్రీ జేపీ నడ్డా గారితో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..@PawanKalyan @ncbn @AmitShah @JPNadda pic.twitter.com/BHzuuF4Vi6
— JanaSena Party (@JanaSenaParty) March 7, 2024
మరోవైపు టీడీపీ - జనసేన కూటమిలో బీజేపీ చేరే అంశంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో బుధవారం జరిగిన సమావేశంలో ఢిల్లీ పరిణామాలపైనా ఇరువురు అధినేతలు మధ్య కీలక చర్చ జరిగింది. దాదాపు గంటన్నర పాటు చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చర్చలు సాగాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లి చర్చలు జరపడం గమనార్హం.












Click it and Unblock the Notifications