Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలుగు ఖాయం అన్న చంద్రబాబు..ధీమా వెనుక కారణాలేంటి..!

నెల్లూరు: యువతకు బంగారు భవిష్యత్తును అందించే బాధ్యత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తాను తీసుకుంటానని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో పవన్‌ కళ్యాణ్‌​తో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు. జరగబోయే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

'పేదల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందన్న జగన్ రెడ్డి వాదనలు నిరాధారమైనవి. జగన్ రెడ్డి ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. దీనికి విరుద్ధంగా, మేము సంపదను ఉత్పత్తి చేయడం, ఆదాయాన్ని పెంచడం.. పౌరులకు సమానమైన పంపిణీని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. అధికారంలోకి రాగానే మెరుగైన సంక్షేమం అందిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.

Chandrababu and Pawan Kalyan slams ys jagan govt in nellore Public Meeting

రాష్ట్రాభివృద్ధి కోసం సైకోను సాగనంపాలని ఈ సందర్భంగా చంద్రబాబు పిలుపునిచ్చారు. జగన్ అధికారంలో ఉంటే ప్రజలకు భవిష్యత్‌ లేదని, తమ ఆస్తులకు భద్రత లేదని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోని రావాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ తీసుకొచ్చారని దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం ఉండదని, దస్తావేజులు ఉండవని చంద్రబాబు అన్నారు.

భూముల రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయని.. ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్‌ అనుమతి కావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్‌ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండో సంతకం ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దుపై చేస్తానని తెలిపారు. ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్‌ తీసుకొస్తామని వారి కోసం హజ్‌హౌస్‌ నిర్మిస్తామన్నారు. ముస్లిం సోదరులకు మక్కా యాత్రలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మౌజమ్‌, ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచుతామన్నారు. ఐదేళ్లలో యుతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు హామీల వర్షం కురిపించారు.

నెల్లూరు-తిరుపతి-చెన్నైని ట్రైసిటీగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు తెలిపారు. అంతేగాక, ఈ ప్రాంతాన్ని హార్డ్‌వేర్‌, ఎలక్ట్రానిక్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన టిడ్కో ఇళ్లకు వైసీపీ రంగులు వేసుకున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 48 వేల ఇళ్లు అర్హులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రైతును రాజుగా చేసి ఏటా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఏప్రిల్‌ నుంచి సామాజిక పింఛన్​లు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పింఛన్​లు అందజేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరోవైపు, పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ప్రజలు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ఇప్పడున్న పరిస్థితులలో చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి కావాలని తెలిపారు. అందరం కలిసి కూటమి ప్రభుత్వాన్ని స్థాపించుకుందామని కోరారు. ప్రజల భవిష్యత్తుకు మనస్ఫూర్తిగా అండగా ఉంటామని అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+