వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలిపిరి వద్ద స్వల్ప ప్రమాదం, మండిపడ్డ చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌లోని వాహనానికి స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని ఇంటెలిజెన్స్ ఐజీ కారును తుడా వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి వాహనం ఢీకొట్టింది. దీంతో వాహనం వెనుక భాగం కొద్దిగా దెబ్బతిన్నది. పన్నెండేళ్ల క్రితం అలిపిరి వద్దనే చంద్రబాబుపై బాంబు దాడి జరిగిన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

చంద్రబాబు క్షేమంగా పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

తిరుమలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న దేవాదాయ శాఖ మంత్రి, చైర్మన్‌లు.

చంద్రబాబు

చంద్రబాబు

తిరుమలలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలుకుతున్న దేవాదాయ శాఖ మంత్రి, చైర్మన్‌లు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబుకు స్వాగతం పలుకుతున్న జీఈవో

తిరుమల

తిరుమల

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు తిరుమలకు చేరుకున్నారు.

అయితే, ఆయనను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలను, అభిమానులను పోలీసులు భద్రత పేరుటో కలిసేందుకు అనుమతించలేదు. పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు కార్యకర్తలను అడ్డుకున్న పోలీసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

దుర్గగుడికి పోటెత్తిన భక్తులు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా దుర్గగుడికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయం దర్శనాన్ని ఆలయ అధికారులు రద్దు చేశారు. ఇంద్రకీలాద్రిపై లఘుదర్శనానికి అనుమతినిచ్చారు.

English summary
Chandrababu angry at Police for stoping tdp activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X