Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారి ఖాతాలలో రూ.20వేల భృతి.. చంద్రబాబు సర్కార్ శుభవార్త!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు, రాష్ట్ర వ్యవసాయ మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి, వారి ఆర్థిక ప్రగతికి ప్రభుత్వం ఇస్తున్న చేయూతను పేర్కొన్న సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో ఇస్తున్న భృతిని పెంచినట్టు తెలిపారు.

మత్స్యకారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ కృషి
ఇక మత్స్యకారుల సంక్షేమం కూటమి ప్రభుత్వ ధ్యేయమని, వారి జీవనోపాధికి, వారి కుటుంబాల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్యఉత్పత్తిని పెంచడం, మత్స్య రంగంలోని సమస్యలను పరిష్కరించడం, మత్స్యకారుల ఆదాయాన్ని మెరుగుపరచడం, ఆధునిక సాంకేతికతను వారికి అందుబాటులోకి తేవడం వంటి చర్యలకు ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. రాష్ట్రంలో ఆక్వా రంగం మరింత పురోగమించి అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా రూపొందిస్తున్నట్టు తెలిపారు.

chandrababu announced good news Rs 20 000 in fishermen accounts during fishing ban time

మత్స్య కారులకు ఆర్ధిక భరోసా అందించే భృతి పెంపు
వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం 20 వేల రూపాయల భృతిని అందిస్తోందని గుర్తు చేసిన ఆయన గత ప్రభుత్వం పదివేల రూపాయలు భృతిని ఇస్తే, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం 20 వేల రూపాయలను ఇస్తుందని, ఈ మొత్తం మత్స్యకారుల సేవలో పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని అన్నారు.

వారికి ఉపాధి కల్పించేందుకు కృషి
రాష్ట్రవ్యాప్తంగా దీని ద్వారా ఒక లక్ష 29 వేల 178 మత్స్యకార కుటుంబాలకు 259 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూరినట్లు ఆయన తెలిపారు. వేట నిషేధ కాలంలో ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా వలస వెళ్లే మత్స్యకారులకు స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడానికి కూడా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్య సంపద ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.

మత్స్యకార కుటుంబాల సామాజిక, ఆర్ధిక ప్రగతికి కూటమి సర్కార్ కృషి
ఇక ఆక్వా రైతులకు సైతం విద్యుత్ టారిఫ్ లను తగ్గించి ఆక్వా రంగ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.మత్స్యకార కుటుంబాల సామాజిక, ఆర్ధిక ప్రగతికి కూటమి సర్కార్ అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందన్నారు. తీర ప్రాంత అభివృద్ధి ద్వారా స్థిరమైన ఆర్ధిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు అచ్చెన్నాయుడు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+