తిరుమల లడ్డూ వివాదం, అందుకే పిన్ టూ పిన్ ఆలోచించిన చంద్రబాబు
గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదం తయారు చెయ్యడానికి జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వినియోగించారని, ఇతర అక్రమాలు జరిగాయని, తిరుమలలో అపచారాలు జరిగాయని, తిరుమలలో అధికార దుర్వినియోగం జరిగిందని తదితర ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థను( సిట్) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
సిట్ అధికారులుగా ఎవరిని నియమిస్తారని మంగళవారం సాయంత్రం వరకు శ్రీవారి భక్తులు అనేక రకాలుగా ఆలోచించారు. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏర్పాటుచేసిన సిట్ ప్రత్యేక అధికారిగా గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమిస్తూ మంగళవారం సాయంత్రమే చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ కమిటీలో సభ్యులుగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు కొంతమంది పోలీస్ అధికారులకు చోటు కల్పించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదాల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ చీఫ్ గా ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని నియమించడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి నీతి, నిజాయితీ కలిగిన అధికారి అని, ఆయన వివాదాలకు దూరంగా ఉంటారని పోలీస్ శాఖ లో పేరు ఉంది. ఇక విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేసిన అనుభవం ఉంది.
తిరుమలలో పనిచేసిన అనుభవంతో గోపీనాథ్ జెట్టికి సిట్ లో అవకాశం కల్పించారని తెలిసింది. తిరుమలలో పిన్ టూ పిన్ గురించి గోపీనాథ్ జెట్టికి తెలుసని, తిరుమల లడ్డూ ప్రసాదాల కోసం ఉపయోగించే నెయ్యి నిల్వ చేస్తున్న గౌడన్లు, తిరుమల శ్రీవారి భక్తులకి అందిస్తున్న అన్నప్రసాదాలకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల గౌడన్లు గురించి గోపీనాథ్ జెట్టికి పూర్తి అవగాహన, పూర్తి సమాచారం తెలుసని, అందుకే ఆయనకి ఆ బాధ్యతలు అప్పగించారని సమాచారం.

కల్తీ నెయ్యి వ్యవహారంలో త్వరగా దర్యాప్తు జరిపించి తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని తెలిసిందే. అయితే సిట్ దర్యాప్తు బృందానికి ప్రత్యేక అధికారులు ఇస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది సిట్ లో అనేక మంది డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కూడా ఉంటారని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలిపింది.












Click it and Unblock the Notifications