వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిటాల రవి హత్య వెనుక చంద్రబాబు - ప్రమాణం చేస్తావా : నమ్మకద్రోహి - వల్లభనేని వంశీ సంచలనం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీలో పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ముఖ్యమంత్రి జగన్ పైన పట్టాభి చేసిన వ్యాఖ్యలో వైసీపీ శ్రేణులు మండి పడ్డాయి. మంత్రుల మొదలు పార్టీ నేతల వరకు అందరూ టీడీపీ పైన విరుచుకుపడ్డారు. కొందరు కార్యకర్తలు పట్టాభి నివాసంతో పాటుగా టీడీపీ కార్యాలయం పైన దాడికి దిగారు. ఇప్పటికే వారిలో పోలీసులు కొందరిని అరెస్ట్ చేసారు. ఇక, ఈ దాడికి నిరసనగా చంద్రబాబు చేసిన 36 గంటల దీక్షా వేదికగా టీడీపీ నేతలు కొందరు వైసీపీకి సవాళ్లు చేసారు.

పరిటాల సునీతకు వంశీ సవాల్

పరిటాల సునీతకు వంశీ సవాల్

అందులో భాగంగా మాజీ మంత్రి పరిటాల సునీత కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు మారాలని సూచించారు. చంద్రబాబు సీఎం అయిన తరువాత గంట సేపు కళ్లు మూసుకుంటే తామేంటే చూపిస్తామని..తమ ఒంట్లో ప్రవహించేది సీమ రక్తమే అంటూ వ్యాఖ్యానించారు. దీనికి కొనసాగింపుగా కొడాలి నాని.. వల్లభనేని వంశీ పైన వ్యాఖ్యలు చేసారు. వారిద్దరికీ టీడీపీ రాజకీయంగా అవకాశాలు కల్పించిందని..తమకు మాటలు వచ్చంటూ హెచ్చరించారు. దీనికి ఇప్పటికే వల్లభనేని వంశీ స్పందించారు. తాను పరిటాల సునీతను వదిన లాగా చూస్తానని..ఇప్పటికే అదే భావనతో ఉన్నానని చెప్పుకొచ్చారు.

పరిటాల రవికి వ్యతిరేకంగా ..వారి వెనుక

పరిటాల రవికి వ్యతిరేకంగా ..వారి వెనుక


గన్నవరం ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయటానికి సిద్దయంటూ ఖాళీ లెటర్ హెడ్ పైన సంతకం చేసారు. అదే విధంగా గన్నవరం నుంచి లోకేశ్ ను పోటీకి దించి గెలిపించుకోవాలంటూ పరిటాల సునీతకు వంశీ సవాల్ చేసారు. ఇక, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలను ఒక ప్రముఖ ఇంగ్లీషు వెబ్ సైట్ ప్రచురించింది. వంశీ మాజీ మంత్రి.. పరిటాల రవి కి వ్యతిరేకంగా అనంతపురంలో కొందరి నేతలతో చంద్రబాబు మాట్లాడించారని చెప్పుకొచ్చారు. పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి సహా మరి కొందరి నేతలను పరిటాల రవిని టార్గెట్ చేయటంతో వెనుక చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు.

పరిటాల రవి హత్య లో సంచలన ఆరోపణలు

పరిటాల రవి హత్య లో సంచలన ఆరోపణలు


పరిటాల రవి హత్య విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేసారు. పరిటాల హత్య వెనుక చంద్రబాబు తనకు ప్రమేయం లేదని తన మనవడు లోకేశ్ మీద ప్రమాణం చేయగలరా అంటూ వంశీ సవాల్ చేసినట్లుగా ఆ పత్రిక పేర్కొంది. ఇక, కోడెల మరణం వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పుకొచ్చారు. తనను విశ్వాసఘాతకుడిగా టీడీపీ నేతలు ఆరోపించటం పైన వంశీ రియాక్ట్ అయ్యారు. తాను విశ్వాసఘాతుకుడినే అని చెబుతూ.. కానీ నువ్వు..ఇందిరాగాంధీ, NTR, హరికృష్ణ, మోడీ, అమిత్‌షా లాంటి పెద్దలకు నమ్మకద్రోహివి..వెన్నుపోటుదారుడివి అంటూ చంద్రబాబును ఉద్దేశించి విమర్శించారు.

విశ్వాసఘాతుకాలకు పేటెంట్ నీదే

విశ్వాసఘాతుకాలకు పేటెంట్ నీదే


అంతేకాదు..కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన పార్టీలకు కూడా నమ్మకద్రోహివి అంటూ పేర్కొన్నారు. వెన్నుపోట్లు..నమ్మకద్రోహాలకు, విశ్వాసఘాతుకాలకు నిఖార్సైన పేటంట్‌ నీదే అంటూ ఆరోపించారు వల్లభనేని వంశీ. ఇంకా, నేను కేసీఆర్‌ గారికి పొర్లు దండాలు పెడితే.. మరి నువ్వు చేస్తున్నదేంటి చంద్రబాబు అంటూ ప్రశ్నించారు వంశీ. టీడీపీ నుంచి 2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి గెలిచిన వంశీ.. ఆ తరువాత వైసీపీకి దగ్గరయ్యారు.

ముఖ్యమంత్రి పైన టీడీపీ నేతలు విమర్శలు చేస్తే తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు. కొడాలి నాని ..వల్లభ నేని వంశీ ఇద్దరూ టీడీపీని టార్గెట్ చేయటంతో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పుడు వంశీ చేసిన వ్యాఖ్యల పైన టీడీపీ నేతల స్పందన ఏ రకంగా ఉంటందో చూడాలి.

English summary
Vallabhaneni Vamsi made sensational comments that Chandrababu was behind Paritala Ravi assasination
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X