పవన్ కళ్యాణ్ ఆరా తీశారా?: చంద్రబాబుతో కమల్ హాసన్ భేటీ వెనుక?
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పలువురు ప్రముఖులు వరుసగా భేటీ అవుతున్నారు. ఇది చర్చనీయాంశంగా మారింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, అమరావతి రాజధాని నిర్మాణం, భూసమీకరణ, టిడిపి హయాంలో ప్రవేశ పెట్టిన పథకాలు, అమలు చేసినవి, ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వద్దకు వెళ్లే తదితర అంశాల పైన చర్చిస్తున్నారని తెలుస్తోంది. రెండు గంటలకు పైగా చంద్రబాబు - పవన్ భేటీ కావడం గమనార్హం.
గంటల పాటు భేటీ అవుతుండటంతో... పలు అంశాల పైన వారు సుదీర్ఘంగా చర్చిస్తున్నారని, పవన్ కళ్యాణ్... సీఎం చంద్రబాబు నుంచి పలు అంశాలపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడతారు.

మరోవైపు, తమిళ నటుడు కమల్ హాసన్ కూడా పాల్గొంటున్నారు. కమల్ హాసన్ భేటీ కావడం పైనా చర్చ సాగుతోంది. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధిలో కమల్ హాసన్ పాలుపంచుకోవాలని ఉవ్వీళ్లూరుతున్నట్లుగా తెలుస్తోంది.
ఈ విషయమై మాట్లాడేందుకు కమల్ హాసన్ ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా, రాజధాని ప్రాంతంలో కమల్ హాసన్ ఓ సంస్థను నెలకొల్పాలని భావిస్తున్నారని సమాచారం. రాజధాని నిర్మాణంలో తనవంతు పాత్ర పోషించేందుకు చంద్రబాబు అడుగు వేయనున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications