ప్రత్యేక పరిస్థితిలో రుణమాఫీ హామీ: చంద్రబాబు
హైదరాబాద్: ప్రత్యేక పరిస్థితుల్లో రైతుల రుణమాఫీకి హామీ ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. కరువు పరిస్థితులు రైతులను దెబ్బ తీశాయని, చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర బ్యాంకర్లతో సోమవారం జరిగిన సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రుణమాఫీకి కోటయ్య నేతృత్వంలో కమిటీ వేశామని చెప్పారు.
రుణాల రీషెడ్యూల్‌కు బ్యాంకర్లను కోరామని, సాంకేతిక కారణాలు చూపి ఇబ్బంది పెట్టవదని అడిగామని ఆయన అన్నారు. బ్యాంకులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమ తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు. వ్యవసాయంతో పాటు పౌల్ట్రీ, తదితర పరిశ్రమలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఆయన చెప్పారు. స్వయం ఉపాధి పథకాల ద్వారా పేదలను అభివృద్ధి చేయాలని అనుకున్నామని ఆయన చెప్పారు. కొత్త రాష్ట్రంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరణ్ జైట్లీని కలిసి రుణమాఫీపై ప్రస్తావించానని, రుణమాఫీకి సాయం చేయాలని కేంద్రాన్ని అడిగానని చంద్రబాబు చెప్పారు. రుణమాఫీపై రిజర్వ్ బ్యాంక్ అధికారులను సంప్రదించామని ఆయన చెప్పారు.
రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని చెప్పారు. కలిసికట్టుగా పనిచేస్తేనే సమస్యల నుంచి రాష్ట్రం బయటపడుతుందని చెప్పారు. రైతుల ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకునే రుణమాఫీని ప్రకటించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications