Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మైలవరం టికెట్ పై తేల్చేసిన చంద్రబాబు- వసంత-ఉమ పోరులో..!

ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ జనసేన విడుదల చేసిన ఉమ్మడి జాబితాలో చోటు దక్కని నేతలతో చంద్రబాబు విడివిడిగా భేటీ అవుతున్నారు. ముఖ్యంగా తొలి జాబితాలో సీనియర్లకు చోటు దక్కకపోవడంతో వారిని స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే పోటాపోటీగా మారిన నియోజకవర్గాల్లో రేసులో ఉన్న నేతల్ని కూడా పిలిపించి తగిన క్లారిటీ ఇచ్చి పంపుతున్నారు. ఇందులో భాగంగా నిన్న మైలవరం సీటు ఆశిస్తున్న వసంత కృష్ణప్రసాద్ తో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు... దేవినేని ఉమను నేరుగా పిలిపించి చర్చించారు.

ప్రస్తుతం మైలవరం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే టీడీపీలో క్లారిటీ లభిస్తే రాజీనామా ప్రకటన చేయాలని వేచి చూశారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. నిన్న మైలవరం సీటుపై వసంతతో చర్చించిన చంద్రబాబు.. ఆ మేరకు హామీ ఇచ్చేశారు. ఇవాళ్టి నుంచి నియోజకవర్గంలో పనిచేసుకోవాలని చంద్రబాబు చెప్పేసినట్లు వసంత కృష్ణప్రసాద్ వెల్లడించారు. దీంతో మైలవరం సీటుపై క్లారిటీ వచ్చేసింది.

chandrababu confirms mylavaram ticket to vasantha krishna prasad and no chance to devineni uma

అదే సమయంలో మైలవరం సీటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఈసారి నిరాశ తప్పడం లేదు. మైలవరం సీటును వసంత కృష్ణప్రసాద్ కు కేటాయించడమే న్యాయమని చంద్రబాబు ఆయనకు చెప్పేసినట్లు తెలుస్తోంది. నిన్న దేవినేని ఉమతో భేటీ అయిన చంద్రబాబు.. ఇందులో వసంతకు మైలవరం ఇస్తున్నామని, ఇతర సీట్లలోనూ ఇప్పటికిప్పుడు కేటాయించే పరిస్ధితి లేదని క్లారిటీ ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు భేటీ తర్వాత బయటికి వచ్చిన దేవినేని ఉమ నిరాశగా కనిపించారు.

తాను చంద్రబాబు కుటుంబ సభ్యుడిని అని, ఆయన మాటే తనకు శిరోధార్యం అని దేవినేని ఉమ స్పష్టం చేశారు. గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమ ఐదేళ్లుగా పూర్తిస్దాయిలో పనిచేయడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో గతంలో రెండుసార్లు గెలిచిన మైలవరం సీటులో కానీ, మరో సీటులో కానీ దేవినేని ఉమను అభ్యర్ధిగా చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే టీడీపీ అధికారంలోకి వస్తే ప్రత్యామ్నాయం చూపిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+