సమయం వృధా చెయ్యని చంద్రబాబు.. అమరావతిలో పెట్టుబడులకు వారికి ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఏపీలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి రాజధాని అమరావతి నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నారు. ఇదే సమయంలో ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కూడా ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు .ఈ క్రమంలో ఏపీ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కర్ణాటక వ్యాపారవేత్తలకు పలు సూచనలు చేశారు.

ఏపీలో పెట్టుబడులకు చంద్రబాబు ఆహ్వానం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత తిరుగు ప్రయాణంలో భాగంగా చంద్రబాబు బెంగళూరులోని హెచ్ఐఎల్ ఎయిర్పోర్ట్ లో కాసేపు ఆగారు. ఆ సమయంలో సెంచురీ గ్రూప్ సంస్థల ఈడి అశ్విని పై, ఎండి రవీంద్ర పైలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు.

Chandrababu did not waste time Invitation to karnataka businessmen to invest in Amaravati

సెంచురీ గ్రూప్ సంస్థల ఈడీతో చంద్రబాబు
అమరావతిలో పెట్టుబడులు పెడితే సదరు సంస్థల పారిశ్రామిక ఎదుగుదలకు ప్రభుత్వం నుంచి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని చంద్రబాబు వారికి సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమరావతిలో పెట్టుబడుల విషయంపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబును కలిసిన సెంచురీ గ్రూప్ సంస్థల ఈడీ అశ్విని పై తెలిపారు.

పెట్టుబడులకు చంద్రబాబు పిలుపుతో ఏపీపై దృష్టి
అలాగే చంద్రబాబును బెంగుళూరు ఎయిర్ పోర్ట్ లో కర్ణాటక తెలుగు సమాఖ్య ప్రధాన కార్యదర్శి బెల్లం రమణ ఆ రాష్ట్ర ఇంటర్నల్ సెక్యూరిటీ డివిజన్ ఏడిజీపి మువ్వా చంద్రశేఖర్ కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక బాబు పిలుపుమేరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టే విషయంపై పెట్టుబడిదారులు ఆలోచనలో పడ్డారు.

ఎయిర్ పోర్ట్ లో కూడా సమయం వృధా చెయ్యని బాబు..
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న చంద్రబాబు ఏ చిన్న అవకాశం దొరికినా పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే చిత్తూరు పర్యటనలో ఎయిర్ పోర్ట్ లో తనకు దొరికిన కొద్దిపాటి సమయంలో కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టండి రండి అంటూ కర్ణాటక వ్యాపారవేత్తలను ఆహ్వానించారు.

ఏపీలో అమరావతిలో పెట్టుబడులకు ఆస్ట్రేలియన్ కాన్సులేట్ రెడీ
కాగా ఇప్పటికే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాజాగా చెన్నైలోని ఆస్ట్రేలియన్‌ కాన్సులేట్‌కు చెందిన ప్రతినిధులు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్లి సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌తో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు వారు ఆసక్తి చూపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+