బిజెపి, టిడిపి సమన్వయ కమిటీ భేటీలో బాబు సూచన: సోము వీర్రాజు డుమ్మా

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సమక్షంలో శనివారం బిజెపి, తెలుగుదేశం పార్టీల సమన్వయ కమిటీ భేటీ జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున కిమిడి కళా వెంకటరావు, నారా లోకేష్, ఎంపి కొనకళ్ల పాల్గొన్నారు.

బిజెపి తరఫున మంత్రులు కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, ఎంపి హరిబాబు పాల్గొన్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. కాగా, సమన్వయ కమిటీ సమావేశం సుహృద్భావ వాతావరణలో జరిగిందని, నెల లేదా నెలన్నరకోసారి కమిటీ సమావేశమవుతుందని కామినేని శ్రీనివాస్ చెప్పారు.

 Chandrababu directs BJP and TDP leaders: Somu Veerraju absent

ఇదిలావుంటే, ఇరు పార్టీల నాయకులకు చంద్రబాబు సూచనలు చేసారు. పరస్పర విమర్శలు మానుకోవాలని ఆయన వారికి సూచించారు. పరస్పర విమర్శల వల్ల ఇరు పార్టీలకు కూడా నష్టం వాటిల్లుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, టిడిపిపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న సోము వీర్రాజు ఈ సమావేశానికి రాకపోవడం గమనార్హం. ఇటీవల టిడిపిపై కావూరి సాంబశివరావు, దగ్గుబాటి పురంధేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు వంటి నాయకులు తీవ్రమైన విమర్శలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+