రూ.4.80 లక్షల కోట్ల ఒప్పందాలు, 10 లక్షల ఉద్యోగాలు: గంటా, బాబు 'భారీ' ఆశలు
విశాఖ: ఏపీలోని విశాఖలో జరిగిన సన్ రైజ్ పేరుతో జరిగిన భాగస్వామ్య సదస్సులో పర్యాటక రంగానికి సంబంధించి రూ.4,659 కోట్లతో 26 ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి గంటా శ్రీనివాస రావు మంగళవారం నాడు వెల్లడిచారు.
మొత్తంగా రూ.4.80 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయన్నారు. భాగస్వామ్య సదస్సులో ఇప్పటి వరకు 334 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు గంటా మంగళవారం నాడు మధ్యాహ్నం తెలిపారు. మొత్తంగా అక్షరాలా రూ.4,80,878 కోట్ల విలువైన ప్రాజెక్టులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు.
వీటిద్వారా 10,15,836 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో ఈఎస్‌ఎస్ అండ్ ఎల్ సంస్థ రూ.83వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గంటా తెలిపారు.

వచ్చే రెండు సంవత్సరాలు భాగస్వామ్య సదస్సు విశాఖలోనే నిర్వహిస్తామన్నారు. ఐవరీ శాండ్, వైకెఎం ఎంటర్ ప్రైజెస్, ఇంటర్ గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీలు ఎంవోయులు కుదుర్చుకున్నాయని మంత్రి గంటా చెప్పారు.
విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా దళిత విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల పైన పరిశీలించామని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర రావు వేరుగా చెప్పారు. దళిత విద్యార్థులకు శిక్షణను ఇచ్చి బహుళ జాతి కంపెనీలలో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు.
కాగా, విశాఖ భాగస్వామ్య సదస్సు ద్వారా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. ఇప్పటి వరకు పర్యాటక రంగంలో 26 ఎంవోయూలు, రూ.4,659 కోట్ల ఒప్పందాలు కుదిరాయి.












Click it and Unblock the Notifications