చంద్రబాబు ఆ నిర్ణయం కేసీఆర్ ఆలోచన మార్చేసింది - దెబ్బకు దెబ్బ..!!

బీఆర్ఎస్ అధినేత..తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీలో ఏం చేయబోతున్నారు. ఏపీకి చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరటంతో ఇప్పుడు సడన్ గా ఈ చర్చ మొదలైంది. మరో పది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికలు వస్తున్నాయి. కానీ, సడన్ గా కేసీఆర్ ఏపీ వైపు మళ్లారు. బీఆర్ఎస్ తెలంగాణ కంటే ఏపీకే ముందుగా అధ్యక్షుడిని ఖరారు చేసారు. టీడీపీ, బీజేపీ, జనసేన లో పని చేసిన సీనియర్లను ఎంపిక చేసుకున్నారు. ఇంత సడన్ గా కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక అసలు కారణం పై చర్చ మొదలైంది. చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయమే కేసీఆర్ సడన్ డెసిషన్స్ కు కారణంగా తెలుస్తోంది.

చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ అలర్ట్..

చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ అలర్ట్..

టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. ఖమ్మం వేదికగా బహిరంసభ నిర్వహించారు. పార్టీని వీడిన నేతలు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. మరిన్ని సభలకు సిద్దం అవుతున్నారు. అయితే, ఈ సభల వెనుక చంద్రబాబు రాజకీయ లక్ష్యం ఏంటో బీఆర్ఎస్ నేతలకు స్పష్టం అయింది. తెలంగాణలో మిగిలి ఉన్న బలంతో బీజేపీకి అండగా నిలవాలని...తద్వారా ఏపీ రాజకీయాల్లో 2014 తరహా పాత్తులను రిపీట్ చేయాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ నేతలు ఓపెన్ గానే చెప్పారు. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. బీజేపీకి మద్దతు ఇవ్వటం ద్వారా పరోక్షంగా తమకు చంద్రబాబు నష్టం చేస్తున్నారనేది బీఆర్ఎస్ నేతల వాదన. దీంతో, కర్ణాటక, మహారాష్ట్రలో నిర్ణయాలు దిశగా చేస్తున్న కసరత్తు ఏపీ వైపు మళ్లింది. తమతో టచ్ లో ఉన్న నేతలను రంగంలోకి దింపారు. ఏకంగా ఏపీలో తమ పార్టీ అధ్యక్షుడిని ఖరారు చేసారు.

టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం..

టీడీపీని ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహం..

తెలంగాణలో బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ మధ్య రాజకీయ యుద్దం సాగుతోంది. టీడీపీ బీజేపీకి మేలు చేసేలా అడుగులు వేస్తోంది. దీంతో, వెంటనే ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు చంద్రబాబుకు ఎంత ప్రతిష్ఠాత్మకమో సీఎం కేసీఆర్ కు బాగా తెలుసు. ఏపీలో చంద్రబాబును ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని డిసైడ్ చేసారు. టీడీపీ అటు జనసేనతో పొత్తు పొత్తు దిశగా వేస్తున్న అడుగులు గమనించారు. ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చే సామాజిక - ప్రాంతీయ సమీకరణాల పైన ఫోకస్ చేసారు. జనసేనకు బలమైన కాపు నేతల మద్దతు ఉందని గ్రహించారు. జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించిన కాపు వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్ కు ఏపీ పార్ీ బాధ్యతలు కేటాయించారు. అదే విధంగా ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా, కీలకమైన గోదావరి జిల్లాల నుంచి తన పార్టీలో చేరికలకు ప్రాధాన్యత ఇచ్చారు. దీని ద్వారా టీడీపీ - జనసేన తమ బలం తో వైసీపీని దెబ్బ తీయాలని భావిస్తున్న ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ పోటీలో ఉండటం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతో కొంత చీలటం ఖాయం. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, జనసేనకు నష్టం చేసే అంశం.

ఇద్దరు చంద్రులు..రెండు రాష్ట్రాలు

ఇద్దరు చంద్రులు..రెండు రాష్ట్రాలు

కేసీఆర్ ఏపీలో ఏ మేర ప్రభావం చూపిస్తారనే చర్చ కొనసాగుతోంది.రాష్ట్ర విభజన ప్రభావిత అంశాలు ఏపీలో ఇంకా ప్రజల మధ్య చర్చలో ఉన్నాయి. అమరావతి శంకుస్థాపన సభకు వచ్చిన కేసీఆర్ నాడు ఏపీ రాజధానిగా మద్దతిచ్చారు. ఇప్పుడు మూడు రాజధానుల వ్యవహారంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంటుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏపీ విభజన కారణంగా నష్టపోయిందనే అభిప్రాయంతో ఉన్న రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వరని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే అభిప్రాయం వైసీపీ తాజా- మాజీ మంత్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కేసీఆర్ ఏపీలో పార్టీ విస్తరణ దిశగా వేస్తున్న అడుగులు ఆసక్తిని పెంచుతున్నాయి. అటు తెలంగాణలో చంద్రబాబు..ఇటు ఏపీలో చంద్రబాబు రోజు రోజుకీ మారుతున్న రాజకీయ సమీకరణాల్లో ఎటువంటి అడుగులు వేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+